వేపచెట్టుకు డ్రోన్‌తో రసాయనాలు స్ప్రే
ఆత్మకూరు(ఎం) : చాలా చోట్ల వేప చెట్లకు వైరస్ సోకడంతో ఆకులు రాలి చెట్లు ఎండిపోతున్నాయి. దీంతో ఆత్మకూరు(ఎం) మండల పరిధిలోని రహీంఖాన్‌పేట గ్రామానికి చెందిన రైతు దుంప శివరాజు తన వ్యవసాయ పొలంలోని వేప చెట్లను కాపాడుకునేందుకు రసాయన మందును డ్రోన్ సహాయంతో పిచికారీ చేస్తున్నాడు. అగ్రికల్చర్, హార్టికల్చర్, ఫారెస్టు అధికారులకు తెలియజేసినప్పటికీ సరైన స్పందన లేకపోవడంతో తానే స్వయంగా తెలుసుకుని డ్రోన్ ద్వారా రసాయన మందు పిచికారీ చేస్తున్నట్లు రైతు పేర్కొన్నాడు.
గిరిజన నాయకులతో మాజీ మంత్రి సమావేశం
నాగార్జునసాగర్ : నాగార్జునసాగర్‌లోని విజయ విహార్‌లో మాజీ మంత్రి రవీంద్రనాయక్ బుధవారం గిరిజన నాయకులతో సమావేశం నిర్వహించారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు–గిరిజనుల పాత్ర, గిరిజనులు ఎదురొటున్న సమస్యలపై ఆయన చర్చించారు. త్వరలో నాగార్జునసాగర్ నుంచి ఢిల్లీవరకు బంజారా రథయాత్ర కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ ప్రాంత గిరిజనులంతా యాత్రకు మద్దతు తెలుపాలని అన్నారు. ఈ కార్యరక్రమంలో రమావత్ దినేష్‌నాయక్, గోపినాయక్, సర్దార్‌నాయక్, బాలునాయక్, రాములనాయక్, నరేష్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు.
వేపచెట్టుకు డ్రోన్‌తో రసాయనాలు స్ప్రే


