యాదగిరీశుడిని దర్శించుకున్న గంగోత్రి కాళికా పీఠాధిపతి
యాదగిరిగుట్ట : యాదగిరి లక్ష్మీనరసింహస్వామిని గంగోత్రి కాళికా పీఠాధిపతి నారాయణ తీర్థ్ స్వామిగల్ గంగోత్రి శంకరాచార్యులు బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆయనకు సంప్రదాయంగా స్వాగతం పలికారు. శంకరాచార్యులు గర్భాలయంలోని స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ముఖ మండపంలోని సువర్ణ పుష్పార్చనమూర్తులను దర్శించుకుని, అష్టోత్తర పూజల్లో పాల్గొన్నారు. ఆ తర్వాత ఆయన ప్రవచనం చేయగా, అర్చకులు వేద మంత్రాలతో ఆశీర్వచనం చేశారు.
భువనగిరిలో ఎంఎంటీఎస్
రైల్వే ట్రాక్ పనులు ముమ్మరం
భువనగిరిటౌన్ : భువనగిరి మున్సిపాలిటీ పరిధిలోని మాస్‌కుంట వద్ద ఎంఎంటీఎస్ రైల్వే ట్రాక్ నిర్మాణ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. రైల్వే ట్రాక్ పక్క నుంచి ఈ పనులు చేపట్టారు. ఎంఎంటీఎస్ రైల్‌ను ఘట్‌కేసర్ నుంచి వంగపల్లి వరకు విస్తరిస్తున్నారు. రూ. 412 కోట్లతో సుమారు 41 కిలో మీటర్ల మేర విస్తరించడానికి చేపట్టిన పనులు చకచకాసాగుతున్నాయి. 2028 నాటికి పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.


