వ్యక్తి అదృశ్యం.. కేసు నమోదు
తిరుమలగిరి(సాగర్) : తిరుమలగిరి మండల పరిధిలోని జువ్విచెట్టుతండా గ్రామ పంచాయతీకి చెందిన సపావత్ శ్రీను(36) అదృశ్యమైనట్లు ఎస్‌ఐ వీరశేఖర్ బుధవారం తెలిపారు. శ్రీను ఈ నెల 13వ తేదీన ఉదయం వేళ గ్రామ శివారులోని పెద్దవాగులో చేపలు పట్టేందుకు వెళ్లి తిరిగిరాలేదని చెప్పారు. కుటుంబ సభ్యులు, బంధువులు ఎంత వెతికినా అతడి ఆచూకీ లభించలేదని పేర్కొన్నారు. బుధవారం శ్రీను తండ్రి సీర ఇచ్చిన ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. శ్రీను గురించిన ఆచూకీ తెలిసిన వారు 87126 70199 నంబర్‌కు సమాచారం అందించాలని ఎస్‌ఐ సూచించారు.


