
గరిష్టస్థాయి వద్ద నిలకడగా సాగర్ నీటిమట్టం
నాగార్జునసాగర్: సాగర్ జలాశయానికి వరద నీరు కొనసాగుతోంది. ఎగువ నుంచి సాగర్ జలాశయానికి 83,775 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతుండగా అంతే నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నాలుగు గేట్ల ద్వారా 32,400 క్యూసెక్కులు, విద్యుదుత్పాదన ద్వారా 34,063 క్యూసెక్కులు మొత్తం 66,463 క్యూసెక్కుల నీటిని దిగువ కృష్ణానదిలోకి విడుదల చేస్తున్నారు. అలాగే కుడి, ఎడమ కాల్వలకు 17,317 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. వర్షాలు కురుస్తుండడంతో ఏఎమ్మార్పీ, వరద కాల్వలకు నీటిని నిలిపివేశారు. సాగర్ జలాశయం ప్రస్తుతం పూర్తిస్థాయి నీటిమట్టమైన 590 అడుగులు (312.0450 టీఎంసీల) వద్ద నిలకడగా ఉంది.