సూర్యాపేట అర్బన్ : భారత్‌పై అమెరికా 50శాతం సుంకాలు పెంచి దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్నా ప్రధాని మోదీ నోరు మెదపడం లేదని సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున్‌రెడ్డి అన్నారు. భారత్‌పై అమెరికా సుంకాలు విధించడాన్ని నిరసిస్తూ శుక్రవారం జిల్లా కేంద్రంలోని నల్లాలబావి సెంటర్‌లో సీపీఎం ఆధ్వర్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేస్తుందనే నెపంతో అమెరికా మన దేశంపై అధిక సుంకాలు విధించి రెండు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలను దెబ్బతీస్తుందన్నారు. పాకిస్థాన్–భారత్ మధ్య యుద్ధాన్ని కూడా తానే ఆపానని ట్రంప్ పలుమార్లు ప్రకటించినా ప్రధాని మోదీ కనీసం మాట్లాడక పోవడం దారుణమన్నారు. అమెరికా విధించిన సుంకాలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు నెమ్మాది వెంకటేశ్వర్లు, జిల్లా నాయకులు కోట గోపి, చెరుకు ఏకలక్షి్, మేకనబోయిన శేఖర్, ధనియాకుల శ్రీకాంత్, నాయకులు పాల్గొన్నారు.
ఫ సీపీఎం జిల్లా కార్యదర్శి నాగార్జున్‌రెడ్డి