
పోలీస్ శాఖపై నమ్మకం పెంచాలి : ఎస్పీ
సూర్యాపేటటౌన్ : పోలీస్ స్టేషన్లకు వచ్చే ప్రతి ఫిర్యాదుదారుడికి నమ్మకం పెరిగేలా పారదర్శకంగా సేవలు అందించాలని జిల్లా ఎస్పీ నరసింహ ఆదేశించారు. శనివారం సూర్యాపేటలోని పోలీస్ కార్యాలయంలో పోలీస్ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర పోలీస్ శాఖ అత్యాధునికమైన సాంకేతికత కలిగి ఉందన్నారు. కేసుల దర్యాప్తులో సాంకేతిక నైపుణ్యాన్ని వినియోగించుకుంటూ పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నట్టు తెలిపారు. పోలీసులు నిత్యం ప్రజలతో ఉంటూ వారికి రక్షణ కల్పించాలన్నారు. ప్రజలకు ఇబ్బందులు కలిగించే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సమీక్షలో జిల్లా అదనపు ఎస్పీలు రవీందర్‌రెడ్డి, జనార్దన్‌రెడ్డి, డీఎస్పీలు ప్రసన్నకుమార్, రవి, నరసింహాచారి, స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ ఇన్‌స్పెక్టర్ రామారావు, డీసీఆర్‌బీ ఇన్‌స్పెక్టర్ హరిబాబు, సీఐలు రాజశేఖర్, వెంకటయ్య, నాగేశ్వరరావు, శివశంకర్, రామకృష్ణారెడ్డి, చరమందరాజు, సిబ్బంది పాల్గొన్నారు.
రిటైర్‌మెంట్ బెనిఫిట్స్ విడుదల చేయాలి
సూర్యాపేటటౌన్ : మార్చి–2024 నుంచి రిటైరైన ఉద్యోగుల రిటైర్‌మెంట్ బెనిఫిట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని రిటైర్డ్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు పి.కోటయ్య, ప్రధాన కార్యదర్శి సుభాని కోరారు. శని వారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు.బెనిఫిట్స్ అందని కారణంగా పిల్లల పెళ్లిళ్లు చెయ్యలేక, అప్పులు తీర్చలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో యూనియన్ గౌరవ అధ్యక్షుడు ఉపేందర్, దశరథరామారావు, జ్ఞాన్‌సుందర్, లింగయ్య, సుధాకర్ పాల్గొన్నారు.
జూమ్ మీట్‌కు జిల్లా రైతులు
నడిగూడెం : దేశ రాజధాని ఢిల్లీలో శనివారం ప్రధాని నరేంద్ర మోదీ పీఎం ధన్–ధాన్య కృషి యోజన పథకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమాన్ని వీక్షించేందుకు హైదరాబాద్‌లోని ఐసీఏఆర్–అగ్రికల్చర్ టెక్నాలజీ అప్లికేషన్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (అటారి) కేంద్రంలో ఏర్పాటు చేసిన జూమ్ మీట్‌కు జిల్లాకు చెందిన ప్రకృతి వ్యవసాయం చేస్తున్న పలువురు రైతులు హాజరయ్యారు. కార్యక్రమంలో అటారి డైరెక్టర్ మీరా, ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్.జేవీ ప్రసా ద్, కేవీకే ప్రతినిధి సంతోష్, రైతులు సోమిరెడ్డి వెంకట్‌రెడ్డి, సోమిరెడ్డి పెద వెంకటరెడ్డి, మంక్త్య, కోట్యా, సైదా, భిక్షం, సీనా పాల్గొన్నారు.

పోలీస్ శాఖపై నమ్మకం పెంచాలి : ఎస్పీ