
ఆర్డీఆర్ మరణం కాంగ్రెస్‌కు తీరనిలోటు
తుంగతుర్తి : మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి మరణం కాంగ్రెస్ పార్టీకి తీరనిలోటని రాష్ట్ర రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి అన్నారు. శనివారం తుంగతుర్తి మండల కేంద్రంలోని మాజీ మంత్రి రాంరెడ్డి దామోద్‌రెడ్డి నివాసంలో ఆయన చిత్రపటానికి కమిషన్ సభ్యులతో కలిసి కోదండరెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దామోదర్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీకి విధేయుడిగా ఉన్న గొప్ప నేత అని కొనియాడారు. ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషిచేయాలన్నారు. ఆయన వెంట రైతు కమిషన్ సభ్యులు రాంరెడ్డి గోపాల్‌రెడ్డి, చెవిటి వెంకన్న యాదవ్, సునిల్‌కుమార్, పలువురు కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.
ఫ రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి