
అన్నికేంద్రాలు ప్రారంభించాలి
భానుపురి (సూర్యాపేట) : సోమవారం నాటికి జిల్లాలోని అన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని అదనపు కలెక్టర్ కె. సీతారామారావు అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో వానకాలం సీజన్‌కు సంబంధించి ధాన్యం సేకరణపై అధికారులతో సమావేశమై సమీక్షించారు. ప్రస్తుతానికి జిల్లాలో 298 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుకు ఆమోదం తెలిపామన్నారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు కలుగకుండా వసతులు కల్పించాలని సూచించారు. ఇంకా ఎక్కడైనా కేంద్రాలు అవసరముంటే ప్రతిపాదనలు పంపాలన్నారు. సమావేశంలో డీఎస్‌ఓ మోహన్‌బాబు, జిల్లా మార్కెటింగ్ అధికారి నాగేశ్వరశర్మ, డీసీఓ పద్మ, డీఏఓ శ్రీధర్‌రెడ్డి, ఏపీడీ సురేష్, ఏడీఎం బెనర్జీ, ఏఎస్‌ఓ శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.