
బాలికలు చదువులో రాణించాలి
చివ్వెంల : బాలికలు చదువులో రాణించాలని సూర్యాపేట జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఫర్హీన్‌కౌసర్ అన్నారు. శుక్రవారం ప్రపంచ బాలికల దినోత్సవం సందర్భంగా జిల్లా కోర్టు ఆవరణలోని డీఎల్‌ఎస్‌ఏ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. బాలికల సంరక్షణ కోసం ప్రభుత్వం చేసిన చట్టాలను సద్వి నియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి గోపు రజిత, మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జి అపూర్వ రవళి, సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ బి. వెంకటరమణ, మహిళా న్యాయవాదులు పాల్గొన్నారు.
ఫ జిల్లా న్యాయసేవాధికార సంస్థ
కార్యదర్శి ఫర్హీన్‌కౌసర్