
మట్టపల్లిలో నిత్యకల్యాణం
మఠంపల్లి : మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో శుక్రవారం రాజ్యలక్ష్మి చెంచులక్ష్మి సమేత లక్ష్మీనరసింహస్వామి నిత్య కల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో సుప్రభాతసేవ, నిత్యహోమం, మూలవిరాట్‌కు పంచామృతాభిషే కం నిర్వహించారు. అమ్మవార్లను పట్టువస్త్రాలతో అలంకరించారు. అనంతరం ఎదుర్కోళ్ల మహోత్సవం, మాంగల్యధారణ, తలంబ్రాలతో కల్యాణాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు విజయ్‌కుమార్, ఈఓ నవీన్‌కుమార్, అర్చకులు పాల్గొన్నారు.
చిరు వ్యాపారులు రోడ్డును ఆక్రమించొద్దు
సూర్యాపేటటౌన్ : చిరు వ్యాపారులు రోడ్డును ఆక్రమించి ట్రాఫిక్‌కు ఇబ్బంది కల్గించవద్దని ఎస్పీ నరసింహ సూచించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని పొట్టిశ్రీరాములు సెంటర్, రాఘవ ప్లాజా, వాణిజ్జ భవన్ సెంటర్లలో ట్రాఫిక్ నియంత్రణ, రోడ్లపై దుకాణాల ఏర్పాటును ఆయన పరిశీలించారు. రోడ్లపైకి వచ్చి వ్యాపారాలు నిర్వహించే వారిని దూరంగా జరిపి సర్దుబాటు చేయాలని సిబ్బందికి సూచించారు. ట్రాఫిక్ సమస్య ఏర్పడకుండా ఉండేందుకు పోలీస్ శాఖ పటిష్ట చర్యలు చేపడుతుందని, ప్రజలు అందుకు సహకరించాలని కోరారు. రోడ్లపై ఎక్కడ పడితే అక్కడ వాహనాలు ఆపవద్దన్నారు.
పరిసరాల పరిశుభ్రత సామాజిక బాధ్యత
తుంగతుర్తి: పరిసరాల పరిశుభ్రత ఒక సామాజిక బాధ్యత అని సివిల్ జడ్జి ఎండీ. గౌస్ పాషా అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని జూనియర్ సివిల్ కోర్టు ఆవరణలో నిర్వహించిన స్వచ్ఛభారత్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కోర్టు పరిసరాలను పరిశుభ్రం చేశారు. పరిసరాల పరిశుభ్రతపై విద్యార్థులు యువత ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు అన్నెపర్తి జ్ఞానసుందర్, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.
జనవరి 25 నుంచి ఐద్వా ఆలిండియా మహాసభలు
సూర్యాపేట అర్బన్ : జనవరి 25 నుంచి 28 వరకు హైదరాబాదులో ఐద్వా 14వ జాతీయ మహాసభలు నిర్వహించనున్నట్లు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మద్దెల జ్యోతి తెలిపారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఎంవీఎన్ భవన్‌లో జరిగిన ఐద్వా జిల్లా కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడారు. మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కా రం కోసం ఐద్వా రాజీలేని పోరాటం చేస్తుందన్నారు. మహాసభలను విజయవంతం చేయాలని కోరారు. అనంతరం మహాసభల కరపత్రాలను ఆవిష్కరించారు. ఐద్వా జిల్లా అధ్యక్షురాలు తంగెళ్ల వెంకట చంద్ర, సభ్యులు మేకనబోయిన సైదమ్మ, విజయలక్ష్మి, షేక్ ఖాజాబీ, ఇందిరాల త్రివేణి పాల్గొన్నారు.

మట్టపల్లిలో నిత్యకల్యాణం

మట్టపల్లిలో నిత్యకల్యాణం