
కాంగ్రెస్, బీజేపీ కుట్రతోనే సీబీఐ విచారణ
తుంగతుర్తి : కాంగ్రెస్, బీజేపీ కుట్రలో భాగంగానే కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణను తెరమీదికు తెచ్చారని తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై రేవంత్‌రెడ్డి చేస్తున్న తప్పుడు ఆరోపణలను నిరసిస్తూ సోమవారం తుంగతుర్తిలో తెలంగాణ తల్లి విగ్రహానికి జలాభిషేకం చేసి రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా కిషోర్ మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరిగిందని దానిపై కమిటీ వేసి నివేదిక తెచ్చి అసెంబ్లీలో పెట్టామని కాంగ్రెస్ వారు ప్రజలను తప్పుదోవ పట్టించాలని చూశారని వారికి మాజీ మంత్రి హరీష్ రావు ఘాటైన సమాధానం ఇచ్చారన్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీ దిక్కుతోచనిస్థితిలో సీబీఐ విచారణ అంటూ కేంద్రంలోని బీజేపీతో కుమ్మకై ్క రాజకీయం చేస్తోందన్నారు. ఓటుకు నోటు కేసులో దొంగ రేవంత్ రెడ్డి, చంద్రబాబు, బీజేపీ డైరెక్షన్‌లో కేసీఆర్ పై కుట్ర చేస్తున్నారని ధ్వజమెత్తారు. తప్పుడు ఆరోపణలు, కుట్ర కేసులకు బీఆర్‌ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఏనాడూ భయపడలేదని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో ఎలాంటి అవినీతి జరగలేదని స్పష్టం చేశారు. కేసీఆర్ పై విచారణ అంటేనే తెలంగాణ రైతాంగాన్ని అవమానించినట్లవుతుందని పేర్కొన్నారు. కమిషన్ నివేదికపై అసెంబ్లీలో మాట్లాడేందుకు సమయం ఇవ్వకుండా ప్రభుత్వం.. గొంతు నొక్కే ప్రయత్నం చేసిందన్నారు. కాళేశ్వరం జలాలతో తుంగతుర్తి నియోజకవర్గం సస్యశ్యామలం అయిందన్నారు. రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రస్థాధన కోసం ఏనాడూ జైలుకు వెళ్లలేదని జై తెలంగాణ అని కూడా నినాదం చేయలేదని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డికి తెలంగాణ గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. ప్రజలంతా ఈ విషయాన్ని గమనిస్తున్నారని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డికి ప్రజాక్షేత్రంలో తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు. అనంతరం ఎస్సీ కాలనీలో వినాయకుని వద్ద పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలోబీఆర్ ఎస్ రాష్ట్ర నాయకులు గుజ్జ యుగంధర్ రావు, తాటికొండ సీతయ్య, సంకిపల్లి రఘునందన్‌రెడ్డి, శోభన్‌బాబు, రాములు గౌడ్, ఎస్‌ఏ రజాక్, పులుసు యాదగిరి, సోమేష్, ఉపేందర్, శ్రీనివాస్, తునికి సాయిలు, రమేష్ ,శ్రీనివాస్, వెంకన్న, రవి తదితరులు పాల్గొన్నారు.
ఫ మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్‌కుమార్