అర్జీలను త్వరగా పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

అర్జీలను త్వరగా పరిష్కరించాలి

Sep 2 2025 7:41 PM | Updated on Sep 2 2025 7:41 PM

అర్జీలను త్వరగా పరిష్కరించాలి

అర్జీలను త్వరగా పరిష్కరించాలి

భానుపురి (సూర్యాపేట) : ప్రజావాణి అర్జీలను జిల్లా అధికారులు చొరవ తీసుకొని త్వరగా పరిష్కరించాలని కలెక్టర్‌ తేజస్‌ నంద్‌లాల్‌ పవార్‌ ఆదేశించారు. సోమవారం సూర్యాపేట కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి ఆర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ కొన్ని శాఖల్లో చాలా రోజుల నుంచి ప్రజావాణి ఫిర్యాదులు పెండింగ్‌లో ఉన్నాయని, ఆయా శాఖల అధికారులు వీటి పరిష్కారంపై దృష్టి సారించాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌డీఓ వీవీ అప్పారావు, డీపీఓ యాదగిరి, డీఏఓ శ్రీధర్‌ రెడ్డి, డీసీఓ పద్మ, డీఈఓ అశోక్‌, డీఎంహెచ్‌ ఓ చంద్రశేఖర్‌, డీఎస్‌ఓ మోహన్‌ బాబు, ఎస్‌ సీ కార్పొరేషన్‌ ఈడీ శ్రీనివాస్‌ నాయక్‌, సంక్షేమ అధికారులు శంకర్‌, దయానందరాణి, పరిపాలన అధికారి సుదర్శన్‌ రెడ్డి, సూపరింటెండెంట్లు సాయి గౌడ్‌, సంతోష్‌ కిరణ్‌, శ్రీనివాసరాజ్‌, శ్రీలత రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

నష్టం అంచనాలు రూపొందించాలి

ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల జరిగిన నష్టం అంచనాలను రూపొందించి సమర్పించాలని కలెక్టర్‌ తేజస్‌ నంద్‌ లాల్‌ పవార్‌ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సోమవారం హైదరాబాద్‌ నుంచి భారీ వర్షాలు, వరద నష్టాలపై అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, సంబంధిత శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఇందులో జిల్లాలో కలెక్టర్‌ పాల్గొన్న అనంతరం అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఇటీవల భారీ వర్షాలకు ఆర్‌అండ్‌బీ రోడ్లు, లో లెవల్‌ కల్వర్టులు, బ్రిడ్జిలు దెబ్బతిన్నాయన్నారు. అలాగే పంచాయతీ రాజ్‌ ఆధ్వర్యంలో రోడ్లు, గ్రామ పంచాయతీ భవనాలకు సంబంధించి నష్టం అంచనా వివరాలను, వరదలతో పొలాల్లో ఇసుక మేటలు వేయడం, పంట నష్టం, మిషన్‌ భగీరథ పైప్‌ లైనింగ్‌, మున్సిపాలిటీల్లో జరిగిన నష్టాలపై నివేదికలు సమర్పించాలన్నారు. పునరావాస కేంద్రాలకు సంబంధించిన వివరాలు, ఇరిగేషన్‌ అధికారులు కాల్వలు, చెరువులు, మైనర్‌,మేజర్‌ ప్రాజెక్టులకు చెందిన నష్టం వివరాలని క్షేత్ర స్థాయి పర్యటనలు చేసి నివేదికలు ఇవ్వాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఎస్పీ కె. .నరసింహ, ఆర్డీఓ వేణుమాధవ్‌, జెడ్పీ సీఈఓ వి.వి. అప్పారావు, డీఏఓ శ్రీధర్‌ రెడ్డి, ఆర్‌అండ్‌బీ ఈఈ సీతారామయ్య, పీఆర్‌ ఈఈ వెంకటయ్య, టీజీ ఎస్‌పీడీసీఎల్‌ ఎస్‌ఈ ప్రాంక్లిన్‌, సీపీఓ కిషన్‌, మిషన్‌ భగీరథ ఈఈ అరుణాకర్‌రెడ్డి, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఈఈ శ్రీనివాసరావు, డీపీఓ యాదగిరి, డీఎఫ్‌ఓ కృష్ణారెడ్డి, ఇరిగేషన్‌ అధికారి నవికాంత్‌, పశు సంవర్థకశాఖ అధికారి శ్రీనివాస రావు, హార్టికల్చర్‌ అధికారి నాగయ్య, ఫిషరీస్‌ అధికారి నాగులు, మున్సిపల్‌ కమిషనర్‌ హన్మంతరెడ్డి పాల్గొన్నారు.

కలెక్టర్‌ తేజస్‌ నంద్‌లాల్‌ పవార్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement