●దూడల పెంపకమే కీలకం
గార: మేలైన దూడల పెంపకమే పాడిసంపద వృద్ధి చెందేందుకు దోహదం చేస్తుందని శ్రీకాకుళం డివిజనల్ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ సూర్యనారాయణమూర్తి అన్నారు. మండల కేంద్రం కుమ్మరిపేటలో పశుఆరోగ్య శిబిరాల్లో డీఎల్‌డీఏ సౌజన్యంతో దూడల ప్రదర్శన నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఆడదూడల పోటీలు నిర్వహించడం వల్ల బాగా పెంపకంపై శ్రద్ధ వహిస్తారన్నారు. వైఎస్సార్ సీపీ నాయకుడు, జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ మార్పు ధర్మారావు మాట్లాడుతూ వ్యవసాయంతో పాటు పాడిపశువుల పెంపకంతో లబ్ధి చేకూరుతుందన్నారు. వైద్యుల సలహాలతో పెంపకం చేపట్టాలని సూచించారు. విజేతలతో పాటు పాల్గొన్న రైతులందరీకీ బహుమతులను అందజేశారు.


