●స్థల సేకరణ చేపట్టాం
ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి నియోజకవర్గంలో ఎన్‌ఆర్‌ఈజీఎస్ అధికారుల సమన్వయంతో ఒక పశువుల వసతి గృహం ఏర్పాటుకు ఇప్పటికే స్థల సేకరణ చేపట్టాం. తదుపరి పరిశీలన చేపట్టి ఆ తర్వాత నిర్మాణం పై ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నాం. మరి కొద్ది రోజుల్లో పనుల ప్రారంభానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం.
–బి.రాజ్‌గోపాల్, జేడీ, పశు సంవర్ధక శాఖ
గత ప్రభుత్వంలో పాడి రైతు చెంతకు వెళ్లి పశువులకు వైద్యం చేసే విధంగా సంచార పశు వైద్య శాలను ఏర్పాటు చేశారు. అంతే కాకుండా పశు వైద్య సిబ్బంది నియామకాలు చేశారు. వాటి కొనసాగింపు పట్టించుకోకుండా హాస్టళ్ల ఏర్పాటు అంటూ కొత్త రాగాన్ని ఎత్తుకున్నారు. అధికార పార్టీ కార్యకర్తలకు పనులు కల్పించడానికే తప్ప పాడి రైతులకు ఎలాంటి ఉపయోగం లేదు. టెక్కలిలో వ్యవసాయ శాఖ మంత్రి ప్రారంభించిన గో సంరక్షణ శాల నిర్వహణకే దిక్కు లేదు.
– హెచ్.వెంకటేశ్వరరావు, రైతు, టెక్కలి.


