నిర్వహణ భారం
పశువులకు వసతి గృహాల ఆలోచనపై భిన్నమైన అభిప్రాయాలు
ఇప్పటికే పూర్తి స్థాయిలో బిల్లులు
అందక అధ్వానంగా మారిన గోకులాలు
టెక్కలిలో నామ రూపాలు లేని
గో సంరక్షణ శాల
టెక్కలి:
గోమాతలకు రక్షణ కరువవుతోంది. మాటలు తప్ప చేతలు లేని నాయకుల వైఖరికి నిదర్శనాలుగా కునారిల్లుతున్న గోశాలలు కనిపిస్తున్నాయి. వీటిలో వసతులు ఓ వైపు వెక్కిరిస్తుంటే గోవులకు హాస్టళ్లంటూ సమావేశాల్లో హామీలు ఇస్తుండడం విస్తుగొలుపుతోంది. కొద్ది రోజుల కిందట డివిజన్ కేంద్రమైన టెక్క లిలో గో సంరక్షణ శాల ను ఏర్పాటు చేసి కొద్ది రోజులకే మూసేశారు. ఇప్పటికే గోకులాలకు నిధులు ఇవ్వకపోవడంతో ఆ గోకులాలను అధికార పార్టీ వర్గీయులు సొంత కార్యక్రమాలకు వాడుకుంటున్న దాఖలాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు పశువులకు వసతి గృహాల పేరుతో ప్రతి నియోజకవర్గంలో ఎన్‌ఆర్‌ఈజీఎస్ నిధులతో వెండర్ పేరుతో అధికార పార్టీ కార్యకర్తలకు కాసులు వర్షం కురిపించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అంతే కాకుండా నియోజకవర్గ స్థాయి లో కమిటీలు ఏర్పాటు చేసి వారి ఆధ్వర్యంలో వసతి గృహాల నిర్వహణ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ వసతి గృహం ప్రక్రియలో పశు సంవర్ధక శాఖ, ఎన్‌ఆర్‌ఈజీఎస్ సమన్వయంతో షెడ్ల నిర్మా ణం చేపట్టాల్సి ఉంది. రెండు నెలల కిందట జిల్లా అధికారులకు విధి విధానాలు జారీ చేసినప్పటికీ ప్రస్తుతానికి స్థల సేకరణ ప్రక్రియ జరుగుతోంది. ఈ వసతి గృహాల నిర్మాణంపై భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
సాధ్యమయ్యే
పనేనా..?
ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి నియోజకవర్గంలో సుమారు 50 సెంట్లు స్థలంలో సుమారు రూ. 9.95 లక్షలతో ఒక్కో పశువుల వసతి గృహం నిర్మాణం చేపట్టనున్నారు. నిర్మాణ బాధ్యతలను వెండర్‌కు అప్పగిస్తూ నిర్వహణ బాధ్యతలను కమిటీలకు అప్పగిస్తారు. ఒక్కో వసతి గృహంలో 20 పశువులకు ఆశ్రయం కల్పించే విధంగా ప్రణాళిక రూపొందించారు. సొంతంగా పశువులు ఉన్న పాడి రైతులు ఆయా పశువుల పర్యవేక్షణ చేయలేని పక్షంలో వాటిని ఈ వసతి గృహంలో చేర్పించవచ్చు. ఇందులో కమిటీ సభ్యులతో అగ్రిమెంట్ కుదుర్చుకుని వారికి కొంత మొత్తాన్ని చెల్లించేలా విధి విధానాలు పొందు పరిచారు. ప్రస్తుతానికి స్థల సేకరణ ప్రక్రి య కొనసాగుతోంది. జిల్లాలో ప్రస్తుతానికి ఆవులు 3.80 లక్షలు, గేదెలు 24 వేలకు పైగా ఉన్నట్లు అధికారుల అంచనా. అయితే వ్యక్తిగతంగా నిర్మా ణం చేపట్టిన గోకులాల పరిస్థితే అధ్వానంగా ఉన్న నేపథ్యంలో ఇప్పుడు పశువుల వసతి గృహాల నిర్మాణం, నిర్వహణ సాధ్యమేనా అంటూ సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
నిర్వహణ భారం


