వైఎస్ జగన్ సంస్కరణలకు కేంద్రం జేజేలు
నరసన్నపేట: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సాహసోపేతంగా చేపట్టి న భూముల సమగ్ర రీ సర్వే అప్పట్లో ఎంతో సంచలనం కలిగించింది. ఇప్పుడు కేంద్ర ఆర్థిక సర్వే కూడా ఆ ప్రక్రియ ను తాజాగా కొనియాడింది. కేంద్ర సర్వే సంస్థ ఇచ్చిన సర్టిఫికెట్ చూసైనా కూటమి ప్రభుత్వం కళ్లు తెరవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ అన్నారు. ఈ మేరకు ఓ ప్రకటన శనివా రం విడుదల చేశారు. వైఎస్సార్ సీపీ కాలంలో చేపట్టిన భూ సంస్కరణలు దేశానికే మార్గదర్శకం అని కేంద్రం స్వయంగా అప్పట్లో ఒప్పుకుందని గుర్తు చేశారు. నాడు వైఎస్ జగన్ భూ సర్వే చేపడితే రైతుల భూములు లాక్కుంటార ని చంద్రబాబు తప్పుడు ప్రచారం చేశారని, వేదికలపై అసత్యాలు మాట్లాడారని, కానీ ఇప్పుడు స్వయంగా కేంద్ర ఆర్థిక సర్వే అధికారులు ఈ పథకాన్ని ప్రశంసించడంతో బాబు కుట్రలన్నీ పటాపంచలయ్యాయని కృష్ణదాస్ ప్రకటనలో పేర్కొన్నారు. అత్యాధునిక టెక్నాలజీ, జీపీఎస్ సహాయంతో అత్యంత పారదర్శకంగా సర్వే నిర్వహించామన్నారు. జగన్ సీఎంగా ఉన్నప్పుడు చేపట్టిన సంస్కరణలు కేంద్రం కొనియాడుతుంటే కూటమి నాయకులు రాజకీ య కక్షతో బురద జల్లుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
హిరమండలం: చేసిన తప్పులను కప్పి పుచ్చుకునేందుకే టీడీపీ డైవర్షన్ పాలిటిక్స్‌కు పాల్పడుతోందని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సభ్యురాలు, మాజీ ఎమ్మెల్యే రెడ్డిశాంతి విమర్శించారు. శనివారం ఆమె ఓ ప్రకటన విడుదల చేశారు. తిరుమల ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారని మండిపడ్డారు. రాజకీయాల కోసం ఎంతటి నీచానికై నా దిగజారే మనస్తత్వం చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌లకు ఉందనే విషయాన్ని ప్రజలే మా ట్లాడుకుంటున్నారని అన్నారు. తిరుమల లడ్డూ వ్యవహారంలో ఎలాంటి కల్తీ జరగలేదని, ఉద్దేశపూర్వకంగా తిరుమలపై రాజకీయలు చేయడం సిగ్గుచేటన్నారు. ఇదే విషయం ప్రజలు చర్చించుకుంటున్నారన్నారని వాటిని డైవర్షన్ చేసేందుకు కొత్తగా మాజీ మంత్రి అంబటి రాంబాబు చంద్రబాబును అసభ్యంగా తిట్టారంటూ ప్రచారం చేస్తూ టీడీపీ పాలిటిక్స్ మెదలుపెట్టిందని ఆమె పేర్కొన్నారు. ఎన్ని రకాల డైవర్షన్ పాలిటిక్స్ చేసినా ప్రజలు గమనిస్తున్నారన్నారు.
నరసన్నపేట: మాజీ మంత్రి అంబటి రాంబాబుపైన ఇంటి పైన కూటమి ఎమ్మెల్యే మాధవి తదితరులు దాడికి పాల్పడడంపై డీసీసీబీ మాజీ చైర్మన్, తూర్పు కాపు నాయకులు కరిమి రాజేశ్వరరావు తీవ్రంగా ఖండించారు. రాంబాబును హత్య చేసేందుకే ఈ విధంగా పక్కా ప్లాన్ ప్రకారం ఆయన ఇంటిపై దాడి చేశారని ఆరోపించారు. టీడీపీ గూండాలు పోలీసుల సమక్షంలో ఈ విధంగా భౌతిక దాడులకు తెగబడటం శోచనీయమన్నారు. ఈ మేరకు ఆయన శనివారం రాత్రి మాట్లాడారు. మాజీ మంత్రిని ఆయన కుటుంబ సభ్యులను బెదిరించి ఇంటిలో ఉన్న ఫర్నీచర్‌ను ధ్వంసం చేయడం, వ్యక్తిగతంగా దాడులు చేయడం సరికాదని అన్నారు. దాడులను అరికట్టాల్సిన పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించడం శోచనీయమన్నారు.


