10 వేల వాటర్ బాటిళ్లు ఇస్తే 4 పాసులు
అరసవల్లి: ఈ నెల 25న జరగనున్న రథసప్తమి ఉత్సవాలకు సంబంఽధించి భారీగా భక్తులు తరలిరానున్నారని.. వీరి కోసం 10 వేల వాటర్ బాటిళ్లు (250 మి.లీ.)ను ఆలయానికి సమర్పించిన దాతలకు, ఆలయంలో పుష్పాలంకరణకు అధికంగా పూలదండలను ఇచ్చిన వారికి విశిష్ట దర్శనంగా నాలుగు దాతల పాసులను ఇస్తామని ఈవో కె.ఎన్.వి.డి.వి.ప్రసాద్ ప్రకటించారు. శనివారం ఆయన మాట్లాడుతూ ఆర్వో ప్లాంట్ నిర్వాహకులు తమ సంస్థ పేరును బాటిల్‌పై ముద్రించుకోవచ్చునని చెప్పారు. దాతలను ప్రోత్సహించే క్రమంలో కార్యాలయంలో పేర్లను రిజిస్ట్రేషన్ ప్రక్రియ అమలు చేస్తున్నామని వివరించారు. నగరానికి చెందిన దీపక్ కర్ణాణి అనే వ్యాపారి శనివారం పది వేల వాటర్ బాటిళ్లు, రూ.లక్ష విలువైన ఏడు వాటర్ డిస్పెన్షరీలను ఆలయానికి సమర్పించారు.
వసతి గృహాలపై ప్రత్యేక శ్రద్ధ
శ్రీకాకుళం పాతబస్టాండ్: వసతి గహాల్లో విద్యార్థులకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడంతో పాటు పారిశుద్ధ్యం, ఆరోగ్య సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.హరిబాబు సూచించారు. శనివారం శ్రీకాకుళం రామలక్ష్మణ కూడలి వద్ద వెనుకబడిన తరగతుల బాలికల వసతి గృహాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థినుల గదులను పరిశీలించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని హెచ్‌డబ్ల్యూఓకు దిశానిర్దేశం చేశారు. నాణ్యమైన భోజనం అందించాలని స్పష్టం చేశారు. విద్యార్థినులతో ముఖాముఖి మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థి దశ నుంచే క్రమశిక్షణతో మెలగాలన్నారు. సామాజిక మాధ్యమాల దుష్ప్రభావానికి గురికాకుండా కేవలం చదువుపైనే దృష్టి సారించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ఎటువంటి సమస్యలు ఉన్నా వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమాధికారి ఇ.అనురాధ, సిబ్బంది పాల్గొన్నారు.
రౌడీషీటర్‌కు రిమాండ్
శ్రీకాకుళం క్రైమ్: జిల్లా కేంద్రంలోని మంగువారితోటకు చెందిన రౌడీషీటర్ యలమంచిలి కోటేశ్వరరావు మద్యం మత్తులో పబ్లిక్ న్యూసెన్సు చేసినందుకు కోర్టు 10 రోజుల జైలు శిక్ష విధించిందని ఒకటో పట్టణ ఎస్‌ఐ తెలిపారు. కోటేశ్వరరావు శనివారం ఉదయం కిన్నెర థియేటర్ వద్ద మద్యం సేవించి ప్రజలకు తీవ్ర అసౌకర్యాన్ని కలిగించాడని, అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చామని పేర్కొన్నారు.
10 వేల వాటర్ బాటిళ్లు ఇస్తే 4 పాసులు


