నేరాల్లో కొత్త కోణాలు.. వరుస కుంభకోణాలు | - | Sakshi
Sakshi News home page

నేరాల్లో కొత్త కోణాలు.. వరుస కుంభకోణాలు

Nov 10 2025 8:46 AM | Updated on Nov 10 2025 8:46 AM

నేరాల

నేరాల్లో కొత్త కోణాలు.. వరుస కుంభకోణాలు

● జిల్లాను కుదిపేస్తున్న వరుస కుంభకోణాలు

● గార ఎస్‌బీఐ వ్యవహారం నుంచి నకిలీ నోట్ల యవ్వారం వరకు రూ.కోట్లలో దోపిడీ

● జిల్లా కేంద్రంలో కొత్తగా నకిలీ రబ్బరు స్టాంపుల స్కామ్‌

● కుంభకోణాల దర్యాప్తులో పురోగతి శూన్యం

శ్రీకాకుళం క్రైమ్‌ :

ప్రశాంత సిక్కోలును వరుస కుంభకోణాలు కుదిపేస్తున్నాయి. మొన్నటికి మొన్న గార, నరసన్నపేట, శిలగాం స్టేట్‌బ్యాంక్‌ బ్రాంచిల్లో నకిలీ, డ్వాక్రా రుణాలు, తాకట్టు బంగారం మాయం కేసులు విస్మ యం కలిగించాయి. నిన్నటికి నిన్న కాశీబుగ్గ, జి.సిగడాం, మెళియాపుట్టి, శ్రీకాకుళం నగరాల్లో నకిలీ నోట్ల మకిలీలు దడ పుట్టించాయి. తాజాగా జిల్లాకేంద్రంలో నకిలీ రబ్బరు స్టాంపుల యవ్వారం సామాన్యుడిని భయపెడుతోంది. ఈ కేసుల దర్యాప్తుల్లో పురోగతి అంతంతమాత్రంగానే ఉంది.

నకిలీ నోట్ల మకిలీలు..

● 2023 జూలైలో కాశీబుగ్గ కేంద్రంగా అంబటి సంతోష్‌ అనే రౌడీషీటర్‌ మరికొందరితో కలసి నర సన్నపేటకు చెందిన వ్యాపారిని రూ. 50 లక్షలకు మోసం చేశాడు. రూ. 500 నోట్ల కట్టలు అందిస్తే అంతకు పదిశాతం రూ. 2000 నోట్ల కట్టలిస్తానని మభ్యపెట్టాడు. ఇదే వ్యక్తి ఈ ఏడాది జూన్‌లో తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలో మరో గ్యాంగుతో కలసి రూ. 2.5 కోట్ల డీల్‌ వేరే వ్యక్తితో చేసి రూ. 1 కోటి గుంజేశాడు.

● 2024 డిసెంబరు 12న ఒకే రోజు మెళియాపుట్టి మండలం పట్టుపురం, జి.సిగడాం మండలం పెనసాం వద్ద రెండు నకిలీ నోట్ల ముఠాలు పట్టుబడ్డాయి. రూ. 90.25 లక్షల నకిలీ కరెన్సీ, 1.50 లక్షల బ్లాక్‌ కరెన్సీ బయటపడ్డాయి.

● ఈ ఏడాది ఆగస్టు 12న ప్రింటర్‌ సహాయంతో నకిలీనోట్లను ముద్రించి అవి మార్చే క్రమంలో జిల్లాకేంద్రంలోని ఓ లాడ్జీలో తంపటాపల్లి నవీన్‌, బూరగాం శ్రీనివాస్‌లు పట్టుబడ్డారు.

పోస్టల్‌ డిపార్ట్‌మెంట్‌లో..

జిల్లాలో ఈ ఏడాది జూలైలో ఇచ్ఛాపురం కేంద్రంగా పోస్టాఫీస్‌లో రూ. 2.78 కోట్ల కుంభకోణం జరిగింది. కిసాన్‌ వికాస్‌ పత్ర్‌ కేంద్ర పథకంలో భాగంగా 34 ఖాతాల్లో ఉన్న ఈ సొమ్మును అక్కడి సిబ్బందే

దుర్వినియోగం చేశారని యాజమాన్యం గుర్తించారు. ఐదుగురిని అక్కడికక్కడే సస్పెండ్‌చేయగా మరో 15మంది వరకు దీనిలో భాగస్వామ్య మున్నట్లు అనుమానిస్తున్నారు. కేసు సీబీఐకి ఇస్తామని చెప్పినా.. ఇప్పటికీ కుంభకోణం వెనుక సూత్రఽ దారులెవ్వరు, ఎవరి ఖాతాల్లోకి సొమ్ము మళ్లిందన్నది అంతుచిక్కని ప్రశ్నగానే మిగిలింది.

నకిలీ రబ్బర్‌ స్టాంపులు..

తాజాగా నకిలీ రబ్బరు స్టాంపుల యవ్వారం జిల్లాలో దుమారం రేపింది. ఆగస్టులో ప్రింటర్‌ ద్వారా నకిలీ నోట్ల తయారీ చేసిన తంపటాల శివకుమారే ఇందులోనూ సూత్రధారి కావడం, మరో ఇద్దరి చేత రబ్బరు స్టాంపులు తయారీ చేయించడంతో వారిని సీసీఎస్‌ పోలీసులు అరె స్టు చేశారు. ఉమ్మడి జిల్లాలోని రాజాం, చిలకపాలెం, హిరమండలం, నరసన్నపేట, ఎచ్చెర్ల, ఆమదాలవలస, సరుబుజ్జిలి, కోటబొమ్మాళి, పాతపట్నం, జలుమూరు ప్రాంతాల రెవెన్యూ, ఇతర విభాగాల అధికారుల రబ్బరుస్టాంపుల ద్వారా ఫోర్జరీ సంతకాలు చేసి రూ. 5 కోట్ల మేర రుణాలను 20 మంది పొందినట్లు పోలీసుల విచారణలో తేలింది. వీరిలో హిరమండలం, పాతపట్నం, కోటబొమ్మాళికి చెందిన టీచర్లు ఐదుగురు, పోలీసులు ఆరుగురు ఉండటం విశేషం. ఒక్కొక్కరు రూ. 20 లక్షల నుంచి రూ. 40 లక్షలకు పైగా లోన్లు పొందినట్లు తెలుస్తోంది. వాస్తవానికి శివకుమార్‌ ఇంటిలో 600 పైగా డాక్యుమెంట్లు దొరికినా కొన్నే ఆధారాలతో చూ పించి కేసు ప్రాధాన్యతను తగ్గించేశారని, దీని వెనుక ఎంతో మంది హస్తముండటం, వారంతా ముగినిపోయే పరిస్థితి ఉండటంతో మెల్లిగా సద్దుమణిగించే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా బ్యాంకులు, ఫైనాన్స్‌ సంస్థల ప్రతినిధులు, లోన్లు పొందినవారు, స్టాంపులు, రిజిస్ట్రేషన్‌ శాఖ, రెవెన్యూ, పంచాయతీ విభాగాల అధికారులు దెబ్బయ్యే పరిస్థితులున్నాయి. కేసును సీబీసీఐడీకి అప్పగిస్తే రాష్ట్రంలోనే సంచలన కేసుగా నిలిచే పరిస్థితి ఉందని సర్వత్రా చర్చ సాగుతోంది.

స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా బ్రాంచుల్లో వరుసపెట్టి అక్రమాలు బయటపడ్డాయి. 2023 అ క్టోబరులో గార ఎస్‌బీఐలో తాకట్టు బంగారం మాయమై వేరే ఫైనాన్స్‌ సంస్థల్లో తాకట్టు పెట్టిన ఘటన వెలుగులోకి వచ్చింది. ముగ్గురు డీఎస్పీలు దర్యాప్తు అధికారులుగా మారినా ఇప్పటికీ కేసు విచారణ దశలోనే ఉంది. అసలు ముద్దాయిల ను చేర్చే చార్జిషీటు ఇంతవరకు పడనే లేదు.

గతంలో ఇదే గార బ్రాంచిలో రూ. 15 కోట్ల విలువైన నకిలీ రుణాల కుంభకోణం జరిగింది. రైతులు లేకుండానే వారి పేరు మీద అకౌంట్లు సృష్టించి అప్పటి సిబ్బందిలో కొందరు తమ సొంతఖాతాలకు మళ్లించుకున్నారు. ఈ కేసులో బ్యాంకు మేనేజర్‌ సహా నలుగురు సస్పెండ్‌ అయ్యారు.

నరసన్నపేట బజారు బ్రాంచిలో ఉద్యోగుల పేరుతో రూ.కోటికి పైగా రుణాలను నొక్కేసిన బాగోతం బయటపడింది. ఫిబ్రవరిలో ఈ కేసును సీఐడీకీ సైతం అప్పజెప్పారు. బ్రాంచి మేనేజర్‌ శ్రీకర్‌పై సస్పెన్షన్‌ వేటు పడగా ఆర్‌ఎం రాజును పోస్టింగ్‌ లేకుండా కొన్నాళ్లు ఉంచారు.

ఈ ఏడాది మేలో కవిటి మండలం శిలగాం బ్రాంచిలో డ్వాక్రా సంఘాల పేరుతో రుణాలను కాజేసిన వ్యవహారం బయటకు వచ్చింది. సంఘాలకు ఇచ్చింది కొంతైతే.. వాటి పేరున నకిలీ ఖాతాల్లో నొక్కేసింది మరికొంత. బ్యాంకు లెడ్జర్లలోను, డీఆర్‌డీఏ రికార్డులోనూ రుణాల లెక్కల్లోతేడా రావడంతో శాఖాపరమైన విచారణ చేపట్టారు. దీంతో నాలుగేళ్ల కిందట జరిగిన అవినీతి బయటపడింది.

తాజాగా దశాబ్దంన్నర కిందట రైతుల పేరిట రుణాలనుకాజేసినట్లు అప్పటి అధికారులపై ఆరో పణ చేస్తూ ఇటీవల బారువ స్టేట్‌బ్యాంకు బ్రాంచిలో దుమారం రేగింది. భారీ స్కామ్‌ జరిగిందంటూ బయటకు ప్రచారం జరుగుతుండటంతో ఎంత మేర వాస్తవముందో తెలియాల్సి ఉంది.

బ్యాంకుల్లో

అక్రమాలివే..

నేరాల్లో కొత్త కోణాలు.. వరుస కుంభకోణాలు 1
1/1

నేరాల్లో కొత్త కోణాలు.. వరుస కుంభకోణాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement