నేడు ఇచ్ఛాపురం, పలాస నియోజకవర్గాల్లో చెక్కుల పంపిణీ
నరసన్నపేట: కాశీబుగ్గలో ఇటీవల వేంకటేశ్వరాలయం వద్ద జరిగిన దుర్ఘటనలో మృతి చెందిన ఇచ్ఛాపురం, పలాస నియోజకవర్గాలకు చెందిన వారి కుటుంబాలను మంగళవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ పరామర్శిస్తారు. అలాగే మృతులకు పార్టీ ప్రకటించిన రూ.2 లక్షల సాయాన్ని అందజేస్తారు. ఈ మేరకు కృష్ణదాస్ కార్యాలయ వర్గాలు ఓ ప్రకటన విడుదల చేశాయి.
పలాస సివిల్ కోర్టుకు హాజరైన మాజీ మంత్రి సీదిరి
వజ్రపుకొత్తూరు రూరల్: కాశీబుగ్గలో గత నెల 13న కల్తీ మద్యంపై జరిగిన ర్యాలీ సంఘటన పై పోలీసులు కేసు నమోదు చేయడంతో మా జీ మంత్రి సీదిరి అప్పలరాజు సోమవారం పలాస సివిల్ కోర్టుకు హాజరయ్యారు. తమపై పెట్టిన కేసుపై ముందస్తు బెయిల్ కోసం ఆయ న అదనపు జిల్లా కోర్టు సోంపేటకు దరఖాస్తు చేయగా కోర్టు ఈ నెల 4న అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ఆయన అనుమతి పత్రాలతో సోమవారం సాయంత్రం 3 గంటల సమయంలో పలాస కోర్టుకి చేరి కోర్టు ప్రక్రియ పనులు పూర్తి చేశారు.
ఎల్‌ఎఫ్‌ఎల్ హెచ్‌ఎం సుజాతపై ఆర్డీఓ విచారణ
మెళియాపుట్టి: మండలంలోని బందపల్లి బాలికల గిరిజన సంక్షేమ వసతి గృహంలో ఎల్‌ఎఫ్‌ఎల్ హెచ్‌ఎం యవ్వారం సుజాత ఫోన్‌లో మా ట్లాడుతూ విద్యార్థినులతో కాళ్లు పట్టించుకుంటున్న ఫొటో వైరల్ అయ్యింది. ఈ విషయం పత్రికల్లో రావడంతో సుజాతను సస్పెండ్ చేశా రు. సీతంపేట ఐటీడీఏ పీఓ పవార్ స్వప్నిల్ జగన్నాఽథ్ ఆదేశాల మేరకు టెక్కలి ఆర్డీఓ కృష్ణమూర్తి సోమవారం బందపల్లి వసతిగృహంలో విచారణ చేపట్టారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయినితో మాట్లాడి పూర్తి నివేదిక తయారు చేశారు. దీన్ని ఉన్నతాధికారులకు అందజేస్తానన్నారు.
ఈ–క్రాప్ ఉంటేనే ధాన్యం కొనుగోలు
గార: ధాన్యం కొనుగోలులో తీసుకోవాల్సిన జాగ్రత్తలతో పాటు ఈ–క్రాప్‌లో వరి నమోదు ఉన్న రైతుల ధాన్యం మాత్రమే నమోదు చేయాలని, ప్రతి సమాచారం రైతులకు తెలియజేయాల్సిన అవసరం ఉందని జిల్లా సివిల్ సప్లయ్స్ టెక్నికల్ అసిస్టెంట్ విశాలాక్షి అన్నా రు. సోమవారం మండల పరిషత్ కార్యాలయంలో వీఆర్‌ఓలు, టెక్నికల్ అసిస్టెంట్‌లు, వీఏయేలు, డేటా ఎంట్రీ ఆపరేటర్లకు ఒక రోజు శిక్షణ శిబిరం నిర్వహించారు. శిక్షణ శిబిరాన్ని ఎంపీడీఓ శ్రీనివాసులు సందర్శించి సూచనలు చేశారు. ధాన్యం తయారయ్యాక రైతులు ఇచ్చిన సమాచారం మేరకు శాంపిల్ తీసుకోవడం మొదలు, అకౌంట్‌లో నగదు పడిన వరకు సమాచారం ఉండాలన్నారు.
జిల్లాలో కొత్తగా 105 పోలింగ్ కేంద్రాలు
శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లాలోని పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ పనులు తప్పనిసరిగా భారత ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల ప్రకారమే జరగాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. సోమ వారం కలెక్టరేట్‌లో వివిధ రాజకీయ పార్టీలు, అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో కొత్తగా 105 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రతిపాదిస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం ఉన్న 2,358 కేంద్రాలకు అదనంగా ఈ కొత్త ప్రతిపాదనలు ఆమోదం పొందితే, మొత్తం కేంద్రాల సంఖ్య 2,463కు చేరుకుంటుందని తెలి పారు. కేంద్రాల్లో రద్దీని తగ్గించడానికి కొత్త కేంద్రాలను ఏర్పాటు అవసరమని తెలిపారు.
నేడు ఇచ్ఛాపురం, పలాస నియోజకవర్గాల్లో చెక్కుల పంపిణీ
నేడు ఇచ్ఛాపురం, పలాస నియోజకవర్గాల్లో చెక్కుల పంపిణీ


