పరేషన్..!
నరసన్నపేట:
రేషన్ కార్డుదారులపై ఈకేవైసీ పిడుగు పడింది. కార్డుదారులతో పాటు కార్డులో ఉన్న ప్రతి ఒక్కరూ విధిగా రేషన్ షాపునకు వెళ్లి వేలిముద్ర వేసుకోవాలి. ఒకవేళ ఎవరైనా వేలిముద్ర వేయకపోతే వచ్చే నెల నుంచి రేషన్ ఆగిపోయే ప్రమాదం ఉంది. ఒకవేళ కార్డు యజమాని వేలిముద్ర వేయకపోతే కార్డే రద్దయ్యే అవకాశం ఉంది. దీంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. గత మార్చిలోనే వేలిముద్రలు వేశామని.. మరలా వేయమంటే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. ప్రతీ ఆరు నెలలకు ఇలా వేలిముద్రలు వేయడంపై మండిపడుతున్నారు.
కార్డుల కోతకు పన్నాగం..?
కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత అందిస్తున్న సంక్షేమ పథకాల్లో లబ్ధిదారులను ఎలా తగ్గించాలో చూస్తోంది. వీటిలో ఇప్పుడు రేషన్‌కార్డుల వంతు వచ్చిందని పలువురు ఆరోపిస్తున్నారు. దీంట్లో భాగంగా రేషన్‌కార్డుల్లో ఉన్న ప్రతీ ఒక్క లబ్ధిదారుడూ ఈకేవైసీ చేయించుకోవాలని ఆదేశి స్తోందని అంటున్నారు. ఈకేవైసీ చేయించుకోకపోతే డిసెంబర్ నెల కోటా బియ్యం ఇవ్వడం కదరదని ప్రచారం చేస్తోంది. 5 సంవత్సరాల్లోపు చిన్నారులకు ఈకేవైసీ అవసరం లేదు. మిగిలినవారు అందరూ డీలర్ల వద్ద తక్షణమే ఈకేవైసీ చేయించుకోవాలని పౌరసరఫరాల శాఖ హుకుం జారీ చేసింది. దీంతో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక ఇచ్చిన హమీల ప్రకారం కొత్త పథకాలు అమలు చేయకపోగా.. ఉన్న పథకాల్లో లబ్ధిదారులను కత్తిరిస్తోంది బాధపడుతున్నారు. బియ్యం ఎగ్గొడానికి ప్రయత్నాలు చేస్తుందని మండిపడుతున్నారు.
వలస వెళ్లినవారిలో ఆందోళన
ఉపాధి, విద్య, ఉద్యోగం కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లినవారి పరిస్థితి ఏంటని వలస లబ్ధిదారులు భయపడుతున్నారు. ఏ గ్రామంలో రేషన్ కార్డు ఉందో ఆ గ్రామానికి వచ్చి డీలర్ వద్ద ఈకేవైసీ చేయించాలని అంటున్నారు. దీంతో ఎక్కడైనా ఈకేవైసీ చేయించుకునే వెసులబాటు కల్పించాలని కోరుతున్నారు. మరోపక్క అధికారులు రేషన్ డీలర్లపై ఈకేవైసీ కోసం తీవ్రమైన ఒత్తిడి చేస్తున్నారు. ఈకేవైసీ చేయకుండా కార్డులు రద్దయితే డీలర్లే సమాధానం చెప్పుకోవాలని స్పష్టం చేస్తున్నారు. దీంతో ప్రభుత్వం తీరుపై నిరసన వ్యక్తం చేస్తున్నారు.
రేషన్‌కార్డుదారులపై ఈకేవైసీ పిడుగు
ఈనెల 30లోగా వేలిముద్రలు వేయాలని ఆదేశం
లేకుంటే రేషన్ రద్దయ్యే ప్రమాదం
ఆందోళనలో లబ్ధిదారులు
మరింత గడువు ఇవ్వాలి
రేషన్‌కార్డుల్లో ఉన్న లబ్ధిదారులు ఈకేవైసీ చేయించుకోవడానికి మరింత గడువు ఇవ్వాలి. నవంబర్ 30వ తేదీతో గడువు ముగిస్తే చాలామంది లబ్ధిదారులు ఈకేవైసీ చేయించుకోకపోవచ్చు. ఈకేవైసీ పేరుతో పేదలకు అందుతున్న బియ్యం కట్ చేస్తామనే ఆలోచనను ప్రభుత్వం విరమించుకోవాలి. – ధర్మాన జగన్,
లింగన్నాయుడుపేట, జలుమూరు మండలం
30లోగా చేయించుకోవాలి
ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈనెల 30లోగా రేషన్‌కార్డుల్లో ఉన్న లబ్ధిదారులు అందరూ ఈకేవైసీ చేయించుకోవాలి. డీలర్లు వద్దకు వెళ్లి వేలిముద్రలు వేయాలి. వేయనివారికి వచ్చే నెల నుంచి రేషన్‌కార్డుల్లో వారి పేర్లు తొలిగించే ప్రమాదం ఉంది. ప్రతీ ఒక్కరూ గమనించాలి. ప్రభుత్వ ఆదేశాలు పాటించాలి.
– రామకృష్ణ, సివిల్ సప్లయ్ డీటీ, నరసన్నపేట
ఇబ్బంది పడుతున్నారు
గడిచిన మార్చి నెలలో రేషన్ కార్డుదారులందరూ ఈకేవైసీ వేలిముద్ర వేశారు. ఇప్పుడు మళ్లీ వేయమంటే ఇబ్బందే. ప్రతీ ఆరు నెలలకు వేయమనడం సరికాదు. ఇప్పటికే ఇంటింటికీ రేషన్ పంపిణీ ఆపేశారు. దీంతో కార్డుదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు ఆరు నెలలకోసారి ఈకేవైసీ పేరున వేధించడం సరికాదు. – రావాడ మోహనరావు,
మాకివలస, నరసన్నపేట మండలం
పరేషన్..!
పరేషన్..!
పరేషన్..!
పరేషన్..!


