నిలువ నీడ లేదు
● మోంథా తుఫాన్‌లో ఇళ్లు కోల్పోయిన అభాగ్యులు
● ఇంత వరకు సాయం అందించని సర్కారు
వేరొకరి ఉంటిలో ఉంటున్నా
తుఫాన్ దెబ్బకు మా ఇల్లు కూలి పోయింది. మేము ఇప్పుడు మా ఊరిలోని బచ్చు రాజారావుకి చెందిన ఇంటిలోనే ఉంటున్నాం. ప్రభుత్వం నుంచి ఒక్క పైసా ఇప్పటివరకు అందలేదు. మా రెక్కల కష్టం మీదే బతుకుతున్నాం.
– తార రాజేశ్వరి,
బచ్చువానిపేట, తోణంగి, గార మండలం
ఇంటిపై పరదా వేసుకున్నా
మంచంపై పడుకుని ఉండగా గోడ కూలిపోయింది. ఆపై రేకులు కూడా పడిపోయాయి. కేకలు వేస్తే పక్కింటి వారు వచ్చి రక్షించారు. పది రోజులుగా మా ఊరివారే బియ్యం, సామాన్లు ఇస్తున్నారు. పడిపోయిన ఇంటిపై పరదా వేసుకుని ఉంటున్నాను. – దుక్క సూరమ్మ, ఒంటరి వృద్ధురాలు, జొన్నలపాడు కాలనీ, రామచంద్రాపురం పంచాయతీ
బంధువుల ఇంటిలో...
మోంథా తుఫాను ధాటికి ఇంటి గోడ కూలిపోయింది. దీంతో నిరాశ్రయులయ్యాం. కుటుంబం అంతా కలిపి బంధువుల ఇంటిలో తలదాచుకుంటున్నాం. ప్రభుత్వం నుంచి ఎలాంటి పరిహారం అందలేదు. కేవలం మా సామాజిక వర్గం పెద్దలు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు తమకు తోచిన మొత్తం ఆర్థిక సాయం చేశారు.
– సాలిన ఢిల్లీరావు, ఇంటి గోడ కూలిన బాధితుడు, సాలినపుట్టుగ గ్రామం, కంచిలి మండలం
● గార మండలం తోణంగి పంచాయతీ బస్సువానిపేట గ్రామానికి చెందిన తార రాజేశ్వరి, అప్పలరాజు వ్యవసాయ కూలీలు. పూరింటిలో నివసించేవారు. మోంథా తుఫాన్ ప్రభావంతో ఆ ఇంటి గోడలు కూలిపోయాయి. వారికి బస్సు రాజారావు అనే వ్యక్తి ఆశ్రయమిచ్చి ఆదుకున్నారు.
● గార మండలం పాతజొన్నలపాడు గ్రామానికి చెందిన దుక్క సూరమ్మ ఇల్లు తుఫాన్ ధాటికి కూలిపోగా ఆమె బతికి బయటపడ్డారు. ప్రభు త్వం ఇస్తున్న పింఛను, ప్రజాపంపిణీ ఇస్తున్న బియ్యం గింజలే ఆమెకు దిక్కు. కూలిపోయిన ఇంటిపైన పరదా కప్పుకుని తలదాచుకుంటున్నారు.
● గార మండలంలో మోంథా తుఫాన్ కారణంగా 18 ఇళ్లు కూలిపోగా, మూడు పూర్తిగానూ, మరో 15 ఇళ్లు పాక్షికంగానూ ధ్వంసమయ్యాయి. తుఫాన్‌లో ఇల్లు కూలిపోతే ప్రభుత్వమే సాయం అందిస్తుంది. కానీ ఈ ఏడాది అది జరగలేదు. ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటున్న పీ–4 విధానమే దానికి కారణమని తెలుస్తోంది.
తుఫాన్ ప్రభావం వల్ల
దెబ్బ తిన్న ఇళ్ల సంఖ్య 162
పూర్తిగా పాడైపోయిన పక్కా ఇల్లు 1
కచ్చా ఇళ్లు
13
పాక్షికంగా పాడైన
పక్కా ఇళ్లు 6
కచ్చా ఇళ్లు
138
గుడిసెలు
4
జిల్లాలో ఇలా..
ఇల్లు బాగు చేసేంత స్థోమత లేదు
గత నెలలో తుఫాన్ ప్రభావంతో కురిసిన భారీ వర్షాల ధాటికి మా ఇంటి గోడ కూలింది. ప్రస్తుతం ఆ గోడను నిర్మించుకునేంత ఆర్థిక స్థోమత లేదు. నేను, మా ఆయన కష్టపడితే గానీ ఇల్లు గడవదు. ఇంటిలోకి చలిగాలులు వస్తున్నాయి. విష కీటకాల భయం ఉంది. కానీ అందులోనే ఉంటున్నాం.
– పులకల జ్యోతి, జగతి, కవిటి మండలం
నిలువ నీడ లేదు
నిలువ నీడ లేదు
నిలువ నీడ లేదు
నిలువ నీడ లేదు
నిలువ నీడ లేదు


