
‘బంగారం కొంటే రశీదు తప్పనిసరి’
నరసన్నపేట: బంగారం షాపుల్లో బంగారం, ఆభరణాలు కొనుగోలు చేసే వినియోగదారులకు విధిగా రశీదులు ఇవ్వాలని తూనికలు, కొలతల అసిస్టెంట్ కంట్రోలర్ పి.చిన్నమ్మి వ్యాపారులకు సూచించా రు. అలాగే ఈ రశీదులపై బంగారం ఏ క్యారెట్ అనేది కూడా స్పష్టంగా పొందుపరచాలని సూచించారు. నరసన్నపేటలో బంగారు షాపులను ఆమె గురువారం తనిఖీ చేశారు. రశీదులు ఇవ్వడం లేదని, ఇచ్చిన రశీదులపై క్యారెట్ల వివరాలు ఉండడం లేదని తెలిపారు. ఇలా ఇవ్వని వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. అలాగే షాపు ల్లో వ్యాపారులు వినియోగిస్తున్న తూకాలను పరిశీలించారు. వినియోగిస్తున్న ప్రతి తూకానికీ సీళ్లు వేయించుకోవాలని ఆదేశించారు.