
డిగ్రీ నాలుగో సెమిస్టర్ ఫలితాలు విడుదల
ఎచ్చెర్ల : డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్శిటీ, అనుబంధ కళాశాలల పరిధిలోడిగ్రీ 4వ సెమిస్టర్ రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు విడుదలైనట్లు వర్శిటీ పరీక్షల యూజీ డీన్ డాక్టర్ జి.పద్మారావు మంగళవారం తెలిపారు. రెగ్యులర్ విధానంలో 6,972 మందికి గాను 42.47 శాతం మంది, సప్లిమెంటరీలో 4,837 మందికి గాను 55.53 శాతం మంది ఉత్తీర్ణులయ్యారని పేర్కొన్నారు.
పాముకాటుతో వ్యక్తి మృతి
హిరమండలం: ఎల్‌ఎన్‌పేట మండలం బొత్తాడిసింగి గ్రామానికి చెందిన గుమ్మడి రామకృష్ణ (44) పాముకాటుకు గురై సోమవారం రాత్రి మృతి చెందాడు. రామకృష్ణ భార్యతో కలిసి వ్యవసాయ పనులు చేసేందుకు పొలానికి వెళ్లారు. రామకృష్ణ పని చేస్తుండగా పాము కాటు వేయడంతో వెంటనే ఎల్‌ఎన్‌పేట పీహెచ్‌సీకి తరలించారు. మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. ఈయనకు భార్య మహాలక్ష్మి, ఇద్దరు పిల్లలు ఉన్నారు.