
పెద్దల కన్ను
పేదల భూములపై
కవిటి: పారిశ్రామిక అభివృద్ధి పేరుతో పేదలకు ఇచ్చిన భూములను పెద్దలకు కట్టబెట్టే విష ప్రయ త్నం జరుగుతోంది. 270 మందికి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో మంజూరు చేసిన డీ పట్టా భూము లను స్థానిక ఎమ్మెల్యే సహకారంతో కాజేసే కుట్ర జరుగుతోందని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కవిటి మండలం రాజపురంలో సుమారు 270 మందికి పైగా ఎస్సీ, బీసీ కులాలకు చెందిన పేదలకు ఇచ్చిన డీపట్టా భూముల్లో.. స్థల సమీకరణ అంశం ఆందోళన రేకెత్తిస్తోంది. ఇక్కడ పరిశ్రమ ఏర్పాటు చేయనున్నట్టు వస్తున్న వార్తలు ఆ స్థలాల లబ్ధిదారుల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి. వారి సాగు హక్కులో ఉన్న ఈ పట్టా భూ ముల స్థల పరిశీలనకు తాజాగా అమెరికాకు చెందిన ఓ ప్రతినిధి బృందం రావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అమెరికా నుంచి వచ్చిన ప్రతినిధి బృందంలో స్థానిక ఎమ్మెల్యే బెందాళం అశోక్ బంధువు కూడా ఉండడం విశేషం. తమకు దఖలు పడిన ఈ కొండ పోరంబోకు భూముల్ని రెక్కలు ముక్కలు చేసి జీడి మామి డి, పనస తోటలుగా రైతులు అభివృద్ధి చేశారు.
ఇవే భూములకు సంబంధించి దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో పట్టాలు కూడా తాము పొందినట్టు లబ్ధిదారులు చెబుతున్నారు. సర్వే నంబర్ 358లో 10.19 ఎకరాలు, 359లో 7.32 ఎకరాలు, 234లో 4.28 ఎకరాలు, 360లో 5.61 ఎకరాలు, సర్వే నంబర్ 199లో 17.16 ఎకరాలు, 218–4లో 12.01 ఎకరాలు, 275లో 6.49 ఎకరాలు, 279లో 4.54 ఎకరాలు, సర్వే నంబర్ 357లో 5.49 ఎకరాల భూముల్ని ఇటీవల రెవెన్యూ అధికారులు సర్వే బృందం కొలతలు వేసి వివరాల్ని యుద్ధప్రాతిపదికన సిద్ధం చేసింది. ఈ భూముల్లో ఒక్కో రైతుకు అర ఎకరానికి అటు ఇటు గా 270 మంది రైతులు డీ పట్టాలు పొందినట్టు లబ్ధిదారులు చెబుతున్నారు. ఆనాటి నుంచి ఎన్నో వ్యయప్రయాసలతో సాగు చేసిన భూమి వెనక్కి లాక్కుంటే చూస్తూ ఊరుకునేది లేదు బాధిత రైతు లు అంటున్నారు. ముందస్తు సమాచారం తెలప కుండానే రెవెన్యూ అధికారులు గోప్యంగా సర్వేలు నిర్వహించడం పై రైతులు గగ్గోలు పెడుతున్నారు.
వైఎస్సార్ హయాంలో మంజూరు చేసిన భూములను లాక్కునే కుట్ర
ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బంధువులతో కూడిన అమెరికన్ బృందం పరిశీలనతో లబోదిబోమంటున్న లబ్ధిదారులు

పెద్దల కన్ను