ఎచ్చెర్ల ఎంపీపీ చిరంజీవి అరెస్టు | - | Sakshi
Sakshi News home page

ఎచ్చెర్ల ఎంపీపీ చిరంజీవి అరెస్టు

Jul 29 2025 9:25 AM | Updated on Jul 29 2025 9:25 AM

ఎచ్చె

ఎచ్చెర్ల ఎంపీపీ చిరంజీవి అరెస్టు

శ్రీకాకుళం క్రైమ్‌ : జిల్లాలోని ఎచ్చెర్ల మండలానికి చెందిన ఎంపీపీ మొదలవలస చిరంజీవిని ఒడిశా పోలీసులు అరెస్టు చేశారు. సోమవారం వేకువఝామున ఫరీదుపేటలోని ఆయన స్వ గృహానికి జిల్లా పోలీసుల సహకారంతో ఒడిశా పోలీసులు చేరుకుని వారెంటు చూపించి అరెస్టు చేసినట్లు జేఆర్‌ పురం సీఐ అవతారం పేర్కొన్నారు. వివరాల్లోకి వెళ్తే.. 1999లో ఒడిశాలోని కొరాపుట్‌ జిల్లా దమన్‌జోడి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో నాల్కో కంపెనీ తరఫున కాంట్రాక్ట్‌ పనులు చేయించారని, వ్యాపార లావాదేవీల్లో అక్కడ గొడవ రావడంతో చిరంజీవిపై కేసు నమోదైందన్నారు. చిరంజీవిని రిమాండ్‌కు తరలించారని పేర్కొన్నారు.

‘కలెక్టరేట్‌ పనులు వేగవంతం చేయాలి’

శ్రీకాకుళం పాతబస్టాండ్‌: ఇంటిగ్రేటెడ్‌ కలెక్టరేట్‌ పనులు వేగవంతం చేయాలని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ ఆర్‌ అండ్‌ బీ అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన రహదారు లు, భవనాల శాఖ అధికారులు, కాంట్రాక్టర్‌తో కలసి ఆయన నూతన కలెక్టరేట్‌ భవనాన్ని, అక్కడ జరుగుతున్న రోడ్డు పనులను పరిశీలించారు. పనులు వేగవంతం చేయాలని సూచించారు. నాణ్యతపై ఎక్కడా రాజీ పడకూడదన్నారు. కార్యక్రమంలో ఆర్‌ అండ్‌ బీ ఎస్‌ఈ సత్యనారాయణ, ఈఈ తిరుపతిరావు, కాంట్రాక్టర్‌ శ్రీరామ్‌ తదితరులు పాల్గొన్నారు.

ఎనిమిది మంది పేకాటరాయుళ్ల అరెస్ట్‌

పాతపట్నం: మండలంలోని కాగువాడ గ్రామంలోని ఓ కల్యాణ మండపంలో టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు జూద శిబిరంపై ఆదివారం రాత్రి దాడి చేసి ఎనిమిది మందిపై కేసులు నమోదు చేసినట్లు ఏఎస్‌ఐ జి.సింహాచలం తెలిపారు. ఏఎస్‌ఐ తెలిపిన వివరాలు ప్రకారం.. ఇక్కడ కొందరు వ్యక్తులు జూదం ఆడుతున్నట్లు పక్కా సమాచారం టాస్క్‌ ఫోర్స్‌కు పోలీసులకు సమాచారం అందడంతో శిబిరంపై దాడి చేసి ఎనిమిది మంది వ్యక్తులను అదుపులోకి తీసుకుని, పాతపట్నం పోలీస్‌స్టేషన్‌కు అప్పగించారని, వారి వద్ద నుంచి రూ.1,12,030 నగదు, ఆరు ద్విచక్రవాహనాలు, ఎనిమిది సెల్‌ ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నట్లు ఏఎస్‌ఐ తెలిపారు.

పోస్టాఫీస్‌ వద్ద ఖాతాదారుల ఆందోళన

ఇచ్ఛాపురం: ఇచ్ఛాపురం సబ్‌పోస్టాఫీస్‌ వద్ద ఖాతాదారులంతా సోమవారం ఆందోళన చేపట్టారు. సబ్‌పోస్టాఫీస్‌లో గడిచిన డిసెంబర్‌ నెలలో 33 ఖాతాలు ఆన్‌లైన్‌ మోసాల బారిన పడి సుమారు రూ.2కోట్ల86లక్షలు మాయమైనట్లు.. ఈ నెల 25వ తేదీన కొంతమంది ఖా తాదారులకు పోస్టల్‌ అధికారులు తెలిపారు. దీంతో ఆ రోజు నుంచి సోమవారం వరకు పోస్టాఫీస్‌లో గల ఖాతాల పై దర్యాప్తుని పోస్ట ల్‌ ఇన్‌స్పెక్టర్లు శ్రీకాంత్‌, కమల్‌హాసన్‌ చేపడుతున్నారు. ఇప్పటి వరకు కేవలం కిసాన్‌వికాస్‌పత్ర్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లలో మాత్రమే ఈ స్కామ్‌ జరిగినట్లు భావిస్తుండగా.. ప్రస్తుతం మిగిలిన ఖాతాలకు కూడా ఇదేవిధంగా జరిగిందని కొంతమంది ఖాతాదారులు పోస్టల్‌ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఖాతాదారులు సోమ వారం పోస్టాఫీస్‌ వద్ద ఆందోళనకు దిగారు. దీనిపై ఉన్నత స్థాయి దర్యాప్తు జరిపించాలని డిమాండ్‌ చేశారు. ఒకటి, రెండు రోజుల్లో పో స్టల్‌ సూపరింటెండెంట్‌ వచ్చి ఖాతాదారులతో చర్చిస్తారని పోస్టల్‌ ఇన్‌స్పెక్టర్లు అన్నారు.

ఎచ్చెర్ల ఎంపీపీ చిరంజీవి అరెస్టు 1
1/1

ఎచ్చెర్ల ఎంపీపీ చిరంజీవి అరెస్టు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement