
హాస్టళ్లలో ఆకస్మిక తనిఖీలు
శ్రీకాకుళం పాతబస్టాండ్: రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి హరిబాబు సోమవారం స్థానిక బీసీ వెల్ఫేర్ హాస్టల్, ఎస్సీ హాస్టల్, ప్రభుత్వ గిరిజ న ఆశ్రమ పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేశా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ పిల్లల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు. విద్యార్థులతో ప్రత్యక్షంగా మాట్లాడి, వారి సమస్యలు, ఇబ్బందులు అడిగి తెలుసుకున్నారు. హాస్టల్స్‌లోని మౌలిక సదుపాయాలు, భద్రత, పరిశుభ్రత తదితర అంశాలను స్వయంగా పరిశీలించారు. కార్యక్రమంలో అడ్వకేట్, సంఘసేవకులు కె.ఇందిరా ప్రసాద్, ఆయా వసతి గృహాల అధికారులు తదితరులు పాల్గొన్నారు.