అరసవల్లిలో సంప్రదాయ వస్త్రధారణ తప్పనిసరి | - | Sakshi
Sakshi News home page

అరసవల్లిలో సంప్రదాయ వస్త్రధారణ తప్పనిసరి

Jun 21 2025 3:47 AM | Updated on Jun 21 2025 3:47 AM

అరసవల

అరసవల్లిలో సంప్రదాయ వస్త్రధారణ తప్పనిసరి

● ఆర్జిత సేవల్లో ఫ్యాషన్‌ దుస్తులకు అనుమతి నిరాకరణ ● రోజూ సాయంత్రం వరకు ఆదిత్యుని అంతరాలయ దర్శనాలు ● ఆదివారాల్లో రూ.300 టిక్కెట్‌తో అంతరాలయ దర్శనం ● అరసవల్లి ఆలయ ఈఓ కేఎన్‌వీడీవీ ప్రసాద్‌ ప్రకటన

అరసవల్లి:

రసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో భక్తులకు మరిన్ని సౌకర్యాలు కల్పించే క్రమంలో ఆలయ సంప్రదాయాలను కాపాడేలా పలు కీలక నిర్ణయాలను ఆలయ ఈఓ కేఎన్‌వీడీవీ ప్రసాద్‌ శుక్రవారం ప్రకటించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. ఆలయంలో ఇకపై క ల్యాణోత్సవాలు, క్షీరాభిషేక సేవలు, సూర్యనమస్కారాలు తదితర ఆర్జిత సేవల్లో పాల్గొనే భక్తులు ఫ్యాషన్‌ దుస్తులు వేసుకుంటే అనుమతి నిరాకర ణ తప్పదని, కచ్చితంగా సంప్రదాయ వస్త్రధారణ నియమాలను పాటించాల్సిందేనని వివరించారు. సేవల్లో పాల్గొనే భక్తుల్లో పురుషులు పంచె, చొ క్కా, సీ్త్రలు చీర లేదా చుడీదార్‌లతో వస్తేనే ఈ సేవల్లో కూర్చునేందుకు అనుమతి ఉంటుందని ప్రకటించారు. అలాగే ఈ ఆర్జిత సేవల టిక్కెట్లు ధరలు పెంచేందుకు ఉన్నతాధికారులకు ప్రతిపాదించనున్నామని, ఈ మేరకు అనుమతి రాగానే కల్యాణ సేవ, క్షీరాభిషేక సేవలు, సూర్యనమ స్కారాల పూజల రుసుములు పెంచుతూ టిక్కెట్ల విక్రయాలు జరపనున్నట్లుగా ఆయన ప్రకటించారు. అలాగే ఆదిత్యుని అంతరాలయ దర్శనాల వేళలను ఇక మీదట సాయంత్రం వరకు ఉండేలా సమయం పెంపు చేస్తున్నామని, ఈ మేరకు ఆలయ ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మతో సంప్రదించే నిర్ణయాన్ని ప్రకటిస్తున్నామని వివ రించారు.

సోమవారం నుంచి ఽశనివారం వరకు ప్రతి రోజూ ఉదయం 7 నుంచి 11.30 గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 3.30 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రూ.100 టిక్కెట్లు కొను గోలు చేసుకుని ఆదిత్యుని అంతరాలయ దర్శనం చేసుకోవచ్చని తెలిపారు. అలాగే ఆదివారం ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు రూ.300 దర్శన టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తు లను ప్రత్యేక క్యూలైన్‌ ద్వారా దర్శనాలకు అనుమతిస్తారని, అలాగే మధ్యాహ్నం 3.30 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రూ.300 టిక్కెట్ల ద్వారా అంతరాలయ దర్శనాలకు అవకాశం కల్పించనున్నట్లుగా ఈఓ ప్రకటించారు.

అరసవల్లిలో సంప్రదాయ వస్త్రధారణ తప్పనిసరి 1
1/2

అరసవల్లిలో సంప్రదాయ వస్త్రధారణ తప్పనిసరి

అరసవల్లిలో సంప్రదాయ వస్త్రధారణ తప్పనిసరి 2
2/2

అరసవల్లిలో సంప్రదాయ వస్త్రధారణ తప్పనిసరి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement