శ్రీకాకుళం | - | Sakshi
Sakshi News home page

శ్రీకాకుళం

Jun 21 2025 3:47 AM | Updated on Jun 21 2025 3:49 AM

శనివారం శ్రీ 21 శ్రీ జూన్‌ శ్రీ 2025

కొత్తమ్మ తల్లి హుండీ ఆదాయం లెక్కింపు

టెక్కలి రూరల్‌: కోటబొమ్మాళి కొత్తమ్మ తల్లి అమ్మవారి ఆలయ హుండీ కానుకల లెక్కింపు శుక్రవారం నిర్వహించినట్లు కార్యనిర్వహణాధి కారి వాకచర్ల రాధాకృష్ణ తెలిపారు. అలయాని కి సంబంధించి ఆలయ ప్రాంగణంలోని హుండీలను లెక్కించగా 86రోజులకు రూ. 5,59,597 అదాయం వచ్చినట్లు తెలిపారు. ఈ హుండీ లెక్కింపు శ్రీకాకుళం దేవదాయ శాఖ సీనియర్‌ అసిస్టెంట్‌ జి.వి.బి.ఎస్‌ రవికుమార్‌ ఆధ్వర్యంలో జరిగింది.

సరిహద్దులో గట్టి నిఘా

ఇచ్ఛాపురం: నవోదయం 2.0లో భాగంగా ఆంధ్రా ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో ఒడిశా మ ద్యం, నాటుసారా, గంజాయి వంటి నిషేధిత పదార్థాలను అరికట్టడానికి నిఘా పెంచాలని డిప్యూటీ ప్రొహిబిషన్‌ అండ్‌ ఎకై ్సజ్‌ కమిషనర్‌ డి.శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. మున్సిపాలిటీ పరిధి పురుషోత్తపురంలో గల ప్రొహిబిషన్‌ ఎకై ్సజ్‌ చెక్‌పోస్టుని శుక్రవారం పరిశీలించారు. అనంతరం స్థానిక ప్రొహిబిషన్‌ ఎకై ్సజ్‌ పోలీస్‌స్టేషన్‌ని సందర్శించి రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సము ద్ర తీర ప్రాంతాల్లో తరచుగా తనిఖీలు నిర్వహిస్తూ అక్రమ సారా నివారణ కృషి చేయాలని సూచించారు. పెండింగ్‌ కేసుల్లోని నిందితులపై చార్జిషీట్లు వేసి దర్యాప్తు వేగవంతం చేయాలని సూచించారు. కార్యక్రమంలో ప్రొహిబిషన్‌ సీఐ పి.దుర్గాప్రసాద్‌, ప్రొహిబిషన్‌ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

‘మెనూ ప్రకారం భోజనం పెట్టాలి’

పాతపట్నం: మండలంలోని సవర సిద్ధమణుగు బాలుర ఆశ్రమ పాఠశాలను సీతంపేట ఐటీడీఏ ఏపీఓ జి.చిన్నబాబు శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో 10, 9వ తరగతి విద్యార్థులతో కలిసి తరగతి గతిలో కూర్చుని పాఠాలు విన్నారు. అనంతరం విద్యార్థులతో కాసేపు మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు పెడుతున్న మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం పెట్టాలని వార్డెన్‌ జీవనరావుకు సూచించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు కె.అబ్బాయి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

యోగ సాధకులు

నరసన్నపేట:

రసన్నపేటకు చెందిన సుమా బాలబాల, సదాశివుని రవి, వండాన సుప్రజలు ఒక వైపు యోగా సాధన చేస్తూ శిక్షణ ఇస్తున్నారు. స్థానిక సూరజ్‌ నగర్‌కు చెందిన వి. సుమాబాల యోగా టీచర్‌గా నరసన్నపేటలో మంచి గుర్తింపు పొందారు. 2007లో యోగాలో పీజీ డిప్లమా పూర్తి చేసిన సుమాబాల నరసన్నపేటకు యోగా శిక్షణ పరిచయం చేశారు. నరసన్నపేటలోనే ఒక ప్రైవేటు స్కూల్లో టీచర్‌గా పనిచేస్తూ ఉచితంగా మహిళలకు యోగా నేర్పిస్తున్నారు. యోగా దినోత్సవం సందర్భంగా స్థానిక జీసీ హోంలో ప్రత్యేక యోగా క్లాసులు నిర్వహిస్తున్నారు.

చిన్న వయసు నుంచి..

స్థానిక జగన్నాథపురానికి చెందిన సదాశివుని రవి యోగాను ప్రాచుర్యంలోనికి తీసుకువచ్చారు. ఆంధ్రా యూనివర్సిటీలో యోగాలో పీజీ డిప్లమా పూర్తి చేసిన రవి 2010 నుంచి శిక్షణలు ఇస్తున్నారు. 2017 వరకూ విశాఖలో క్లాసులు నిర్వహించగా తర్వాత నరసన్నపేటకు వచ్చి యోగా శిక్షణలు ఉచితంగా స్థానిక యోగా భవన్‌లో ఇస్తున్నారు.

మహిళలకు శిక్షణ నిస్తూ..

స్థానిక శ్రీరాంనగర్‌కు చెందిన వండాన సుప్రజ ఆర్ట్‌ఆఫ్‌ లివింగ్‌లో పూర్తి శిక్షణ పొంది యోగా టీచర్‌గా పనిచేస్తున్నారు. పలు ప్రైవేటు స్కూల్స్‌లో పనిచే స్తూ మహిళలకు ఉచితంగా శిక్షణ ఇస్తున్నారు. 2018 నుంచి యోగా శిక్షణలు ప్రారంభించారు. పలు పోటీల్లోనూ పాల్గొన్నారు.

ఆసనాల్లో శ్రీకాంతులు

ఇచ్ఛాపురం: యోగా సాధన చేయడం వల్ల ఆరోగ్యంతో పాటు పేరుప్రఖ్యాతలు కూడా సంపాదించుకోవచ్చని పట్టణానికి చెందిన శ్రీకాంత్‌ మహంతి రుజువు చేస్తున్నారు. పట్టణానికి చెందిన శ్రీకాంత్‌మహతి శరీరాన్ని రబ్బరులా వంచుతూ ఆసనాలు వేస్తారు. బడి ఈడు లోనే ఆయనలోని ప్రతిభను గుర్తించిన వ్యాయామ ఉపాధ్యాయురాలు జయలక్ష్మి, స్థానిక యోగా సాధకుడు మధుసూదన్‌ బెహరా శ్రీకాంత్‌ను ప్రోత్సహించారు. అప్పటి నుంచి ఆయన వెనుదిరిగి చూడలేదు. ప్రస్తుతం ఆయన యోగాసనాల పోటీలకు జడ్జిగా వ్యవహరిస్తున్నారు. జాతీయ, అంతర్జాతీయ పోటీల్లోనూ పాల్గొన్నారు. 2010 నుంచి 2025 వరకు పదుల సంఖ్యలో బంగారు పతకాలు గెలుచుకున్నారు.

సాధన చేస్తున్న

శ్రీకాంత్‌మహంతి

40 ఏళ్లుగా యోగా సాధన

నేను 40 ఏళ్లుగా యోగా సాధన చేస్తున్నాను. మూడేళ్లుగా హైదరాబాద్‌లోని ప్రీ గురుకుల్‌ సే వా సంస్థలో యోగా, ప్రాణాయామం తరగతులను ఆన్‌లైన్‌లో నిర్వహిస్తున్నాను. 77 ఏళ్ల వయసు వచ్చిన యువకులతో సమానంగా కొన్ని వందల మంది సాధకులతో 108 సూర్యనమస్కారాలు మాఘమాసంలో వేయిస్తుంటాను.

– ఎంవీ రామారావు, విశ్రాంత ఏఈ,

బీఎస్‌ఎన్‌ఎల్‌, శ్రీకాకుళం

న్యూస్‌రీల్‌

శ్రీకాకుళం1
1/10

శ్రీకాకుళం

శ్రీకాకుళం2
2/10

శ్రీకాకుళం

శ్రీకాకుళం3
3/10

శ్రీకాకుళం

శ్రీకాకుళం4
4/10

శ్రీకాకుళం

శ్రీకాకుళం5
5/10

శ్రీకాకుళం

శ్రీకాకుళం6
6/10

శ్రీకాకుళం

శ్రీకాకుళం7
7/10

శ్రీకాకుళం

శ్రీకాకుళం8
8/10

శ్రీకాకుళం

శ్రీకాకుళం9
9/10

శ్రీకాకుళం

శ్రీకాకుళం10
10/10

శ్రీకాకుళం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement