శ్రీకాకుళం
–8లో
ఆదివారం శ్రీ 21 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
ఎక్కడో హిరమండలం నుంచి ఇచ్ఛాపురం వాకిట వరకు
ప్రవహించిన వంశ‘ధార’కు కారణమతడు. ఉద్దానం నుదుటిపై అసమర్థ నాయకులు రాసిన అర్ధాయుష్షు రాతను సమూలంగా మార్చిన నాయకుడతడు. సిక్కోలు గుండెలోని వెనుకబాటు వేదనను అర్థం చేసుకున్న తొలి ప్రజా ప్రతినిధి. దశాబ్దాల తరబడి ఏలిన వారి మాటలు వినడం, ప్రచారాలకు మురిసిపోవడమే తెలిసిన
సిక్కోలుకు పనులు చేసి చూపించిన సమర్థుడు. వలసలే బతుకుదెరువుగా మారిన ఈ జిల్లా మంచి కోసం ఆలోచించిన అరుదైన మనిషి. వైఎస్ జగన్ పాలనలో సిక్కోలు గతమెన్నడూ చూడని ప్రగతిని చూసింది. అందుకు సాక్ష్యాలివే.. –సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం
దశాబ్దాలుగా చావుకు అలవాటుపడిపోయిన ఉద్దానం కిడ్నీ బాధితుల కోసం వైఎస్ జగన్ పలాసలో కిడ్నీ ఆస్పత్రి కట్టించారు. ఈ ఆస్పత్రి వచ్చాకే కిడ్నీ రోగులు ఊపిరి పీ ల్చుకున్నారు. ఈ ఆస్పత్రి మాలాంటి వారికి ఎంతో ఉపయోగపడుతోంది. వైఎస్ జగన్ నిర్మించిన వైఎస్సార్ సుజలధార స్రవంతి పథకం ద్వారా స్వచ్ఛమైన తాగు నీరు అందుతోంది. నేను ఏడాది కాలంగా కిడ్నీ వ్యాధితో ఇదే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాను. ముందుగా ఆరోగ్యం బాగులేకపోవడంతో విశాఖపట్నంలోని ఎన్.ఆర్.ఐ ఆస్పత్రికి వెళ్లాను. అక్కడ చా లా డబ్బులు ఖర్చయ్యాయి. వారు కిడ్నీ వ్యాధి ఉందని చెప్పగా అక్కడ నుంచి పలాస కిడ్నీ ఆస్పత్రికి వచ్చి అందులో చేరాను. జగనన్న ప్రభు త్వం హయాంలో 5 పాయింట్లు ఉంటే పింఛన్ ఇచ్చి ఆదుకున్నారు. ఇలాంటి ఆస్పత్రి కట్టిన జగనన్న నిజంగా దేవుడు. జగనన్నకు ధన్యవాదాలు.
– అంబటి రామకృష్ణ, కిడ్నీ రోగి, డోకులపాడు, వజ్రపుకొత్తూరు
శ్రీకాకుళం
శ్రీకాకుళం


