
తాపీమేసీ్త్ర నుంచి సంగీత గురువుగా..
శాసీ్త్రయ సంగీతానికి పేదరికం అడ్డుకాదు అని ఇచ్ఛాపురం పట్టణానికి చెందిన సంగీత కళాకారుడు ఆశికృష్ణారెడ్డి నిరూపించారు. బెల్లుపడ గ్రామంలో వ్యవసాయకూలీ కుటుంబానికి చెందిన ఆశి వాసు సరోజిని దంపతుల చిన్న కుమారుడు ఆశి కృష్ణారెడ్డి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉండడంతో తాపీపని, కూలిపనులు చేసుకొంటూ కుటుంబానికి చేదోడు వాదోడుగా నిలిచారు. సంగీతంపై మక్కువతో కె.ముఖలింగం, మావుడూరి జగన్నాథశర్మ, మావుడూరి సత్యనారాయణ శర్మ వద్ద సంగీతంలో మెలకువలు నేర్చుకున్నారు. మావుడూ రి జగన్నాథశర్మ పేరిట సంగీత కళాశాలను ప్రారంభించి 22 మంది చిన్నారులకు ఉచితంగా సంగీతంలో శిక్షణ ఇస్తున్నారు.