
స్ట్రాంగ్ రూమ్‌ల భద్రత పరిశీలన
ఎచ్చెర్ల క్యాంపస్: చిలకపాలెంలోని శ్రీ శివానీ ఇంజినీరింగ్ కళాశాలలో ఏర్పాటుచేసిన జిల్లా ఎనిమి ది నియోజక వర్గాల ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల భద్రతను కలెక్టర్ మనజీర్ జిలానీ సమూన్ శుక్రవారం పర్యవేక్షించారు. 18 స్ట్రాంగ్ రూమ్‌లకు ఏర్పాటు చేసిన మూడంచల భద్రతపై సమీక్షించారు. సీసీ కెమెరాల్లో నిక్షిప్తమైన సమాచారం, విజిటర్స్ వివరాలు పరిశీలించారు. పూర్తిస్థాయి భద్రత కల్పించినట్లు చెప్పారు. భద్రత సిబ్బంది విధులు నిరంతరం అప్రమత్తంగా నిర్వహించాల ని సూచించారు. నిరంతర నిఘా కొనసాగుతుందని వివరించారు. సీసీ కెమెరాలను పొలిటికల్ పార్టీ జనరల్ ఏజెంట్లు పరిశీలించే వెసులు బాటు కల్పించారు.