సత్యసాయి మిషన్‌ నిర్వహణలో మహిళలే కీలకం | - | Sakshi
Sakshi News home page

సత్యసాయి మిషన్‌ నిర్వహణలో మహిళలే కీలకం

Sep 20 2026 6:48 AM | Updated on Sep 20 2026 6:48 AM

ప్రశాంతి నిలయం: సత్యసాయి మిషన్‌ను మరింత విస్తృతంగా నడపడంలోనూ ఆయన ఆదర్శాలను ముందుకు తీసుకెళ్లడంలో మహిళల పాత్ర కీలకమని పలువురు వక్తలు అన్నారు. ప్రశాంతి నిలయంలో ప్రారంభమైన రెండు రోజుల విద్యావాహిని నెక్ట్స్‌జన్‌ జాతీయ సదస్సు శనివారం ముగిసింది. రెండో రోజు సాయి హీరా ఇంటర్నేషనల్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో బృంద చర్చలు, ఉపన్యాసాలు నిర్వహించారు.సత్యసాయి సేవా సంస్థల నిర్వహణలో మహిళల పాత్ర అన్న అంశంపై చర్చ సాగింది. సాయంత్రం సాయికుల్వంత్‌ సభా మందిరంలో సదస్సులో నిర్ణయించుకున్న అంశాలపై సభ్యులు ప్రతిజ్ఞ చేశారు. అనంతరం సత్యాసాయిని కీర్తిస్తూ సంగీత కచేరీ నిర్వహించారు.

గణేశ్‌ లడ్డూ ముస్లిం మహిళ

సొంతం

ధర్మవరం అర్బన్‌: పట్టణంలోని పార్థసారథినగర్‌లో సిద్ధి వినాయక ఉత్సవ కమిటీ సభ్యులు భారీ వినాయకుడిని కొలువుదీర్చారు. శనివారం వినాయక నిమజ్జనం సందర్భంగా నిర్వహించిన వేలంలో 12 కిలోల లడ్డూను ముస్లిం మహిళ షేక్‌ చాందిని రూ.1.45 లక్షలకు దక్కించుకున్నారు. వినాయకుడి వద్ద ఉన్న కలశాన్ని అంజలి అనే మహిళ రూ.15,500, కండువాను గుజ్జల మహేష్‌ రూ.3700కు దక్కించుకున్నారు. వినాయక విగ్రహాన్ని దాత సింగంశెట్టి సాయిపృథ్వీ వినాయక విగ్రహానికి రూ.45 వేలు వెచ్చించారు.

21న డయల్‌ యువర్‌

కలెక్టర్‌

ప్రశాంతి నిలయం: శ్రీ సత్యసాయి జిల్లా ప్రజల తాగునీటి సమస్యలు నేరుగా తెలుసుకొని, సత్వరమే పరిష్కరించేందుకు ఈ నెల 21న డయల్‌ యువర్‌ కలెక్టర్‌ కార్యక్రమం నిర్వహించనున్నట్లు డీఆర్‌ఓ కొండయ్య శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని పట్టణాలు, గ్రామాల్లో తాగునీటి సమస్యలుంటే నేరుగా డయల్‌ యువర్‌ కలెక్టర్‌ సెల్‌: 9032020868కు తెలియజేయొచ్చన్నారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను వెంటనే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకుకెళ్లి సత్వరమే పరిష్కరించేందుకు జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకుంటుందన్నారు.

నమో నారసింహ..

కదిరి టౌన్‌: ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి శనివారం భక్తులు పోటెత్తారు. కదిరి పరిసర ప్రాంతాల నుంచే కాక కర్ణాటక, వైఎస్సార్‌ కడప, చిత్తూరు, ఉమ్మడి అనంతపురం జిల్లా నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి లక్ష్మీనారసింహుడిని దర్శించుకున్నారు. భక్తులకు తీర్థప్రసాదాలు, అన్నదానం చేశారు. భక్తులు తలనీలాలు సమర్పించుకుని, మొక్కులు తీర్చున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement