వినాయకా..వీడ్కోలిక! | - | Sakshi
Sakshi News home page

వినాయకా..వీడ్కోలిక!

Sep 20 2026 6:48 AM | Updated on Sep 20 2026 6:48 AM

ధర్మవరం అర్బన్‌/బత్తలపల్లి: ధర్మవరం, బత్తలపల్లిలో శనివారం ప్రశాంతంగా వినాయక నిమజ్జన వేడుకలు జరిగాయి. ఐదు రోజులపాటు కొలువైన భారీ వినాయకులను శుక్రవారం ప్రత్యేక పూజల మధ్య విగ్రహాలకు కదిలించారు. అనంతరం శనివారం నిమజ్జనానికి తరలించారు. ధర్మవరం పట్టణం నుంచి భారీగా వినాయకుని విగ్రహాలను ఊరేగింపుగా తీసుకొచ్చి చిత్రావతి నదిలో నిమజ్జనం చేశారు. ధర్మవరం చెరువుతోపాటు సంగమేశ్వరం వంక, రేగాటిపల్లి చెరువుల్లో వినాయక విగ్రహాలను ప్రజలు నిమజ్జనం చేశారు. ధర్మవరం చెరువులో వినాయకుల నిమజ్జనానికి క్రేన్‌లను ఉపయోగించారు. ధర్మవరం చెరువులోకి ఎవరూ దిగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. బత్తలపల్లి మండలంలోని సంఘమేశ్వర క్షేత్రం సమీపంలోని చిత్రావతి నదిలో వినాయకుని నిమజ్జన వేడుకలు ప్రశాంతంగా ముగిశాయి. ఐదు రోజులపాటు కొలువైన భారీ వినాయకులను పట్టణ పురవీధుల్లో ఊరేగిస్తూ చెరువులోకి తరలించారు. క్రేన్‌ల సాయంతో చెరువులో నిమజ్జనం చేశారు. యువకులు, మహిళలు రంగులు చల్లుకుంటూ కేరింతలు కొడుతూ డాన్స్‌లు చేస్తూ నిమజ్జనానికి తరలించారు. డీఎస్పీ జగన్నాథ్‌రాజు, టూ టౌన్‌ సీఐ జయనాయక్‌, ధర్మవరం రూరల్‌ సీఐ ప్రభాకర్‌గౌడు, తహసీల్దార్‌ ఈశ్వర్‌ ప్రసాద్‌, ఎస్‌ఐ సోమశేఖర్‌ పర్యవేక్షించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement