మడకశిర రూరల్/మడకశిర: రబీ సీజన్‌లో నీటి వసతి ఉన్న రైతులను చియా సాగు చేసేలా ప్రోత్సహించాలని కలెక్టర్ శ్యాంప్రసాద్ అధికారులను ఆదేశించారు. శనివారం జిల్లా కలెక్టర్ కదిరేపల్లి వద్ద రైతు నరసింహప్ప ప్రకృతి వ్యవసాయ పద్ధతులు అనుసరించి సాగు చేసిన రాగి పంటను పరిశీలించారు. అనంతరం రైతుతో రాగి పంట సాగు విధానం, దిగుబడి, ఖర్చు, ప్రకృతి వ్యవ సాయ విధానం తదితర వాటిని అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో వ్యవసాయ, పట్టు పరిశ్రమశాఖ సహాయ సంచాలకులు కృష్ణమీనన్, హనుమంతనాయక్, తహసీల్దార్ ముకుంద, ఏఓ తిమ్మప్ప, ప్రకృతి వ్యవసాయం మాస్టర్ ట్రైనర్ రమేష్, రైతులు తదితరులు పాల్గొన్నారు.
ప్రతి ఒక్కరూ
పచ్చదనాన్ని కాపాడండి..
ప్రతి ఒక్కరూ పచ్చదనాన్ని కాపాడాలని కలెక్టర్ శ్యాంప్రసాద్ సూచించారు. శనివారం పట్టణంలోని వైఎస్సార్ సర్కిల్‌లో మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని చెత్తా చెదారాన్ని తొలగించి మొక్కలు నాటారు. అనంతరం మున్సిపల్ కార్మికులకు ప్లాస్టిక్ రహిత బ్యాగులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి, మున్సిపల్ కమిషనర్ మురళీధర్, తహసీల్దార్ ముకుంద, మున్సిపల్ సిబ్బంది, మున్సిపల్ కార్మికులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
అమరాపురం/గుడిబండ: అమరాపురం మండలంలోని బసవనపల్లిలో రైతు వక్క శంకరప్ప రెండు ఎకరాల్లో చేపట్టిన పెల్లైటెజ్డ్ పీఎం డీఎస్ విధానాన్ని కలెక్టర్ శ్యాంప్రసాద్ పరిశీలించారు. పరిస్థితి ప్రకృతి వ్యవసాయ పద్ధతులు, రైతులకు అందుతున్న సాంకేతిక సాయంపై అడిగి తెలుసుకున్నారు. ఎంటీ రమేష్ పెల్లైటెజ్డ్ పీఎం డీఎస్ విధానం, దానితీరు కలెక్టర్ క్షేత్రస్థాయిలో వివరించారు. గుడిబండ మండలంలోని జంబులబండ గ్రామం సమీపంలో ఉన్న పట్టుపరిశ్రమ ఫారాలను జిల్లా కలెక్టర్ క్షేత్ర స్థాయిలో సందర్శించారు. మడకశిర డివిజన్ సిరికల్చర్ సిబ్బంది చేపట్టిన క్షేత్రస్థాయి అభివద్ధి పనులపై పట్టు పరిశ్రమ సిబ్బందిని అభినందించారు. పట్టు పరిశ్రమ సంచాలకులు హనుమంతరాయప్ప, ఏడీఏ కృష్ణమీనన్, ఏఓ మంజునాథ్ తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ శ్యాంప్రసాద్


