తేదీలు పట్టు రకం కనిష్టం గరిష్టం సగటు
17–6–26 బైఓల్టిన్ రూ.589 రూ.763 రూ.707
18–6–26 బైఓల్టిన్ రూ.560 రూ.790 రూ.714
19–6–26 బైఓల్టిన్ రూ.640 రూ.795 రూ.733
20–6–26 బైఓల్టిన్ రూ.553 రూ.788 రూ.720
21–6–26 బైఓల్టిన్ రూ.605 రూ.795 రూ.724
22–6–26 బైఓల్టిన్ రూ.603 రూ.790 రూ.738
23–6–26 బైఓల్టిన్ రూ.611 రూ.785 రూ.720
24–6–26 బైఓల్టిన్ రూ.600 రూ.806 రూ.720
25–6–26 బైఓల్టిన్ రూ.567 రూ.796 రూ. 727
26–6–26 బైఓల్టిన్ రూ.641 రూ.816 రూ.744
27–6–26 బైఓల్టిన్ రూ.641 రూ.820 రూ.751
28–6–26 బైఓల్టిన్ రూ.609 రూ.819 రూ.724
హిందూపురం: తెల్ల బంగారంగా పిలవబడే ‘పట్టు’ గూళ్ల ధరలు మార్కెట్‌లో ఆశాజనకంగా ఉన్నా.. రైతన్నలకు తెగుళ్లు గుబులు ‘పట్టు’కుంది. మూడు నెలలుగా ధరలు పుంజుకుని, రెండితలయ్యాయి. అయితే ప్రస్తుతం చలిగాలలు, ఖరీఫ్ సీజన్ ప్రారంభమై వాతావరణం మార్పుతో తెగుళ్లు దిగుబడిపై ప్రభావం చూపుతున్నాయని, పంట చేతికందడంలేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. హిందూపురం పట్టుగూళ్ల మార్కెట్‌కు ప్రతిరోజూ 6 వేల క్వింటాళ్లకు పైబడి పట్టుగూళ్లు వచ్చేవి. ప్రస్తుతం తెగళ్ల కారణంగా దిగుబడి తగ్గి 3,500 క్వింటాళ్లకు దిగుబడి తగ్గిపోయిందని మార్కెట్ అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం హిందూపురం మార్కెట్‌లో గరిష్టం అత్యధికంగా క్వింటా రూ.641 నుంచి రూ.780కుపైగా పలుకుతుండగా సగటుగా రూ.800 వరకు ధరలు పలుకుతోందని రైతులు చెప్తున్నారు. హిందూపురం, మడకశిర, గుడిబండ, సోమందేపల్లి, పెనుకొండ, లేపాక్షితోపాటు చిత్తూరు, తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా పట్టుగూళ్లను తీసుకొస్తున్నారు. నెలరోజుల నుంచి ధరలు స్థిరంగా ఉంటున్నాయి. అయితే పట్టుకు ఆకు ముడుత, సుడితెగుళ్ల కారణంగా పురుగులు వృద్ధి చెందక దిగుబడిపై ప్రభావం చూపుతున్నట్లు రైతులు చెప్తున్నారు.
ధరలు ఆశాజనకంగా ఉన్నా.. రైతులను
పీడిస్తున్న తెగుళ్లు
రోజూ మార్కెట్‌కు 2,309 నుంచి 3,600
క్వింటాళ్ల పట్టు గూళ్లు
క్వింటా రూ.800 పైమాటే పలుకుతున్న ధర


