మడకశిర: దళిత యువకుడు క్రాంతికుమార్ కుటుంబానికి న్యాయం జరిగే వరకు కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా దశల వారీగా ఉద్యమం చేస్తామని దళిత సంఘాల నాయకులు ప్రకటించారు. ఆదివారం స్థానిక ఆర్‌అండ్‌బీ బంగ్లాలో దళితులపై జరుగుతున్న దౌర్జన్యాలు, దాడులు,అరాచకాలను నిరసిస్తూ దళిత సంఘాల నాయకులు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. దళిత హక్కుల పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు ఎంఆర్ హనుమంతు అధ్యక్షత వహించారు. కూటమి ప్రభుత్వంలో దళితులపై జరుగుతున్న దాడులు, దౌర్జన్యాలు, అరాచకాలు, అన్యాయాలపై దళిత సంఘాల నాయకులు చర్చించారు. .సీఐ నాగరాజుపై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.సమావేశంలో వైఎస్సార్‌సీపీ జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు నరసింహమూర్తి, జిల్లా కార్యదర్శి రంగనాథ్, ఎమ్మార్పీస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంటిమద్ది ఓబులేసు, వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్ విభాగం నాయకుడు చామలూరు రాజగోపాల్, ఎస్సీ,ఎస్టీ రాష్ట్ర జేఏసీ కన్వీనర్ సాకేహరి ,బహుజన చైతన్య వేదిక నాయకుడు శివరామక్రిష్ణ,ఎస్సీ జన సంఘం నాయకుడు కుళ్ళాయప్ప,ఎస్సీ,ఎస్టీ విజిలెన్స్ కమిటీ సభ్యుడు రామాంజనేయులు,దళిత సంఘం నాయకుడు నిజవల్లిబాబు తదితర దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు.


