హిందూపురం టౌన్: యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ శ్రీ సత్యసాయి జిల్లా (వైఎస్‌ఏ ఎస్‌ఎస్‌ఎస్), యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనుబంధ సంస్థ ఆధ్వర్యంలో స్థానిక శ్రీ వివేకానంద యోగా థెరపీ ఇన్‌స్టిట్యూట్‌లో జిల్లా స్థాయి యోగాసన క్రీడా పోటీలు–2026ను ఆదివారం నిర్వహించారు. ఎల్‌ఐసీ అడ్వైజర్ ఓబుల కొండయ్య, యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాజశేఖర్‌రెడ్డి పాల్గొని,పోటీలను ప్రారంభించారు. పోటీల్లో జిల్లా నలుమూలల నుంచి మొత్తం 73 మంది క్రీడాకారులు పాల్గొనగా, మొత్తం 10 యోగాసన విభాగాలు, ఆరు వయో విభాగాల్లో బాలురు, బాలికలు, పురుషులు, మహిళలకు ప్రత్యేకంగా పోటీలు నిర్వహించారు. మొత్తం 140 ఈవెంట్లలో పాల్గొన్నారు. అదనంగా 10 మంది మాస్టర్స్ విభాగ క్రీడాకారులు తమ ప్రతిభ చాటారు. పోటీల నిర్వహణకు జిల్లా అధ్యక్షుడు గాజుల సోమేశ్వర రెడ్డి, జనరల్ సెక్రటరీ సుబ్బారాయుడు నాయకత్వం వహించగా, కాంపిటీషన్ మేనేజర్ బద్రి నారాయణ, అంతర్జాతీయ యోగాసన న్యాయనిర్ణేత రాఘవేంద్ర పర్యవేక్షించారు. 40కు పైగా విజేతలకు పతకాలు, ప్రశంసా పత్రాలను పీడీ మహేష్ దీపక్, నిమ్మకాయల రాము, రాఘవేంద్రాల చేతుల మీదుగా అందజేశారు. కార్యక్రమంలో రాజేశ్వరి, సులేఖ, దేవాంగం శంకరప్ప, దాస సతీష్, నరసింహారెడ్డి, వెంకటేష్, ఎల్‌ఐసీ శ్రీనివాసులు, చంద్రమౌలేశ్వర గుప్తా, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.


