అంగన్‌వాడీ కేంద్రంలో పౌష్టికాహారం నిలువ | - | Sakshi
Sakshi News home page

అంగన్‌వాడీ కేంద్రంలో పౌష్టికాహారం నిలువ

Jun 28 2026 7:24 AM | Updated on Jun 28 2026 7:24 AM

పుట్టపర్తి అర్బన్‌: జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాలకు సరఫరా చేసే పౌష్టికాహారం బస్తాలను ప్రశాంతిగ్రామం అంగన్‌వాడీ కేంద్రంలో నిల్వ చేశారు. దీంతో సెంటర్‌కు వచ్చే చిన్నారులు, గర్భిణులు, బాలింతలు ఇబ్బందులు పడుతున్నారు. పుట్టపర్తి ప్రాజెక్టు పరిధిలోని సుమారు 203 కేంద్రాలకు సంబంధించిన బాలామృతం బస్తాలను ప్రశాంతి గ్రామం సెంటర్‌లో నిల్వ చేశారు. దీంతో కేంద్రం నిండిపోవడంతో చిన్నారులు ఇబ్బంది పడుతున్నారు. హైదరాబాద్‌ నుంచి బాలామృతం బస్తాలు రాగానే వాటిని గోడౌన్‌లో భద్రపరిచి అంగన్‌వాడీ కేంద్రాలకు సరఫరా చేయాల్సి ఉంది. అయితే వాటిని అక్కడ ఎందుకు ఉంచారు అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. కాంట్రాక్టర్‌ వీటిని గోడౌన్‌కు చేర్చకుండా బిల్లులు చేసుకుంటున్నారా..? లేక మరేదైన కారణం ఉందా..అని సందేహాలు ఉన్నాయని స్థానికులు అంటున్నారు. దీనిపై సీడీపీఓ జయంతిని అడగ్గా, గోడౌన్‌ లేనందున అంగన్‌వాడీ కేంద్రంలో నిల్వ చేశామని ,గోడౌన్‌ అద్దెకు దొరకగానే వాటిని తీయించి వేస్తామని బదులిచ్చారు.

ఇబ్బంది పడుతున్న చిన్నారులు

గోడౌన్‌కు తరలించకుండా

కాంట్రాక్టర్లతో కుమ్మక్కు !

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement