ఇంటిగుట్టు.. పన్నుపోటు! | - | Sakshi
Sakshi News home page

ఇంటిగుట్టు.. పన్నుపోటు!

Jun 27 2026 2:07 AM | Updated on Jun 27 2026 2:07 AM

సాక్షి, పుట్టపర్తి

పుట్టపర్తి.. సత్యసాయి నడయాడిన ఆధ్యాత్మిక క్షేత్రం. అంతర్జాతీయంగా పేరుగాంచిన ప్రాంతం. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన వారితో పాటు విదేశాలకు చెందిన బాబా భక్తులు ఎందరో ఇక్కడ స్థిరనివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. ఏడాదికి వారం, పదిరోజులు ప్రశాంతి నిలయంలో ఉండేవారు కూడా ఇక్కడ ఇళ్లు, ప్లాట్లు కొనుగోలు చేశారు. దీంతో పట్టణంలో జనాభా కంటే ఇళ్ల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ప్రశాంతి నిలయం చుట్టుపక్కల ఎలాంటి అనుమతులు లేని భవనాలు ఆకాశానికి తాకే ఎత్తులో ఉన్నాయి. అందులో వివిధ ప్రాంతాలకు చెందిన వారు నివసిస్తుంటారు. అయితే ఏ ఇంటికి ఎవరు యజమాని అనే విషయం తెలియదు. ఈ పరిస్థితుల్లో మున్సిపల్‌ అధికారులకు వింత పరిస్థితులు ఎదురవుతుంటాయి. ఏ వీధిలో చూసినా ఎక్కువగా తాళం వేసిన ఇళ్లే దర్శనమిస్తాయి. ఒకవేళ ఎవరైనా నివాసం ఉన్నా.. ఇల్లు తమది కాదని పన్ను గురించి తెలియదని చెబుతారు. దీంతో ఆస్తి పన్ను వసూలు చేయడం అధికారులకు తలనొప్పిగా మారుతోంది. ఒక్కో ఇంటిపై రూ.లక్షల్లో బకాయిలు పేరుకుపోయినా ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది.

రెచ్చిపోతున్న అక్రమార్కులు..

సత్యసాయి బాబా నడియాడిన ప్రదేశంలో నివసించేందుకు వివిధ ప్రాంతాల నుంచి పుట్టపర్తికి వస్తుంటారు. అతిథులను సాదరంగా స్వాగతించేందుకు కొందరు సిండికేటుగా మారుతుంటారు. మాయ మాటలతో వారికి ఏదో ఒక ఇల్లు విక్రయిస్తారు. వాళ్లు వెళ్లిన తర్వాత ఆ ఇంటిని స్వాధీనం చేసుకుంటారు. మరొకరికి అమ్మేస్తారు. దీంతో నిజమైన యజమాని కోర్టులు, పోలీస్‌ స్టేషన్ల చుట్టూ తిరుగుతుంటారు. తాజాగా కొన్న వ్యక్తి తాను డబ్బులు చెల్లించానంటూ ఇంటిని అనుభవిస్తుంటారు. అధికారులు వస్తారని తెలిస్తే ఇంటికి తాళం వేసుకుని పత్తా లేకుండా పోతారు. పన్ను వసూళ్ల సమయంలో మరో ఇంటికి మకాం మార్చి అధికారులకు టోకరా వేస్తున్నారు. దీంతో పుట్టపర్తి మున్సిపాలిటీలో పన్ను బకాయిలు రూ.కోట్లలో పేరుకుపోయాయి. అధికారులు మారినా.. కొత్త ప్రభుత్వాలు ఏర్పడినా పరిస్థితి మారలేదు.

డాక్యుమెంట్లతోనే సరిపెడుతూ..

పుట్టపర్తి పట్టణంలో అధికారిక లెక్కల ప్రకారం 12,670 ఇళ్లు ఉన్నాయి. కొత్తగా నిర్మించేవి మరో 2 వేలు ఉంటాయి. వీటికి తోడు ఎలాంటి లెక్కలు లేకుండా.. యజమానులు లేని ఇంకో 2 వేల నివాసాలు ఉన్నాయి. చాలా నివాసాలకు రెండు జతలు చొప్పున డాక్యుమెంట్లు ఉంటాయి. దీంతో క్రయవిక్రయాలు పదే పదే చేస్తుంటారు. ఎవరైనా పుట్టపర్తిలో ఇల్లు కొని దూర ప్రాంతాలకు వెళ్తే.. వచ్చే లోపు కాజేస్తారు. పుట్టపర్తి పట్టణం అనధికారికంగా విస్తరిస్తున్నా.. అధికారిక గణాంకాల్లో మాత్రం పెద్దగా తేడా ఉండదు. మరోవైపు పన్ను బకాయిలు పేరుకుపోవడంతో మున్సిపల్‌ కమిషనర్లుగా వచ్చేందుకు అధికారులు జంకుతున్నారు.

రూ.8.63 కోట్లు

ఏటా పన్ను

బకాయి

రూ.12 కోట్లు

మున్సిపాలిటీ ఏటా ఇచ్చే డిమాండ్‌ నోటీస్‌

పుట్టపర్తి ఏరియల్‌ వ్యూ

పుట్టపర్తిలోని బాబా ఫర్నీచర్‌ షోరూం సమీపంలో

ఓ ఇల్లు వివాదంలో పడింది. ఇంటిపై హక్కులు తమకే ఉన్నాయంటూ ఇప్పటికే ఇద్దరు తెరపైకి వచ్చారు.

అయితే ఆ ఇద్దరూ నకిలీ యజమానులేనని సమాచారం. ఇప్పుడు యజమానులుగా పోటీ పడుతున్న ఇరువురూ

ఆ ఇంట్లో బాడుగకు ఉన్న సమయంలో అసలు యజమాని చనిపోతే.. ఎవరికి వారుగా డాక్యుమెంట్లు తయారు చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇల్లు ప్రస్తుతం ఒకరు

స్వాధీనం చేసుకోగా, మరోవ్యక్తి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఇలాంటి నివాసాలు పుట్టపర్తిలో వేల సంఖ్యలో ఉన్నాయి. దీంతో సదరు ఇంటికి సంబంధించిన ఆస్తి పన్ను వసూలు కూడా ఇబ్బందిగా మారుతోంది.

పుట్టపర్తిలో 2 వేల ఇళ్లకు తాళం

ఆ ఇళ్లకు యజమానులెవరో తెలీదు

పుట్టగొడుగుల్లా నకిలీ డాక్యుమెంట్లు

ఏడాదికి ఒకరు చొప్పున

ఇంటి యజమాని అవతారం

డాక్యుమెంట్లు పట్టుకుని కోర్టు,

పోలీసుల చుట్టూ ప్రదక్షిణ

ఆస్తి పన్ను డిమాండ్‌ నోటీసులిచ్చినా కట్టేవారు కరువు

12,670

పట్టణంలోని

ఇళ్ల సంఖ్య

38,472

పుట్టపర్తి

పట్టణ జనాభా

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement