పెనుకొండ రూరల్ (సోమందేపల్లి): ప్రజాస్వామ్యంలో ఓటుకు ఎంతో విలువ ఉందని, అలాంటి ఓటు హక్కును అర్హులు కోల్పోకుండా చూడాలని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్ కార్యకర్తలకు సూచించారు. జిల్లాలో జరుగుతున్న ఓటర్ల జాబితా ‘ప్రత్యేక సమగ్ర సవరణ’(సర్)పై అందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రతి ఓటరుకూ ఎన్యుమరేషన్ ఫాం అందేలా చూడటంతో పాటు దాన్ని పూర్తిగా నింపి తిరిగి బీఎల్‌ఓలకు అందించేలా పార్టీ బీఎల్‌ఏలు కృషి చేయాలన్నారు. శుక్రవారం ఆమె మండలంలోని బ్రాహ్మణపల్లి, ఈదులబలాపురం, జూలకుంట, మండ్లి పంచాయతీల్లో పర్యటించారు. ఆయా గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి ‘సర్’ కార్యక్రమం గురించి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఉషశ్రీచరణ్ మాట్లాడుతూ.. అర్హుల ఓటు తొలగిపోకుండా కార్యకర్తలు జాగ్రత్త వహించాలన్నారు. సర్ సర్వేలో ఎలాంటి సందేహాలున్నా, ఎప్పటికప్పడు సంబంధిత అధికారులతో నివృత్తి చేసుకోవాలన్నారు. ఎక్కడైనా ఇబ్బందులు తలెత్తినా, అధికార పార్టీ నిబంధనలు ఉల్లంఘించినా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లాలన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ గజేంద్ర, గోవిందం శ్రీనివాసులు, మాజీ సర్పంచులు జిలాన్ ఖాన్, కిష్టప్ప, రామాంజనేయులు, నరసింహ మూర్తి, సోము, ఎంపీటీసీ రామాంజి, నాయకులు రఫీక్, ఆదినారాయణ రెడ్డి, గట్టా మంజునాథ్, రవీంద్ర రెడ్డి పాల్గొన్నారు.
‘సర్’పై అప్రమత్తంగా ఉండాలి
కార్యకర్తలకు
ఉషశ్రీ చరణ్ దిశానిర్దేశం


