జనసంద్రమైన గూగూడు | - | Sakshi
Sakshi News home page

జనసంద్రమైన గూగూడు

Jun 27 2026 2:07 AM | Updated on Jun 27 2026 2:07 AM

నార్పల : గూగూడు కుళ్లాయిస్వామి మొహర్రం ఉత్సవాల్లో కీలకమైన పెద్ద సరిగెత్తు శుక్రవారం కనులపండువగా జరిగింది. అన్ని దారులూ గూగూడు సాగాయి. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులతో గూగూడు జనసంద్రంగా మారింది. మొదట స్వామివారికి తలనీలాలు సమర్పించి ఆంజనేయస్వామిని దర్శించుకున్నారు. అనంతరం కుళ్లాయిస్వామిని దర్శించుకుని చక్కెర చదివించారు. అర్చకులు హుసేనప్ప ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు అగ్నిగుండంలోకి కొబ్బెర, చక్కెర, మొద్దులు వేసి మొక్కులు తీర్చుకున్నారు. తర్వాత భక్తిశ్రద్ధలతో స్వామివారికి పానకాలు సమర్పించారు. ఫక్కీర్లు, భక్తులు అగ్ని గుండం చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ పొర్లుదండాలు పెట్టారు. శనివారం పీర్ల అగ్నిగుండ ప్రవేశం, సాయంత్రం జలధి ఉంటుంది. అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు డ్రోన్‌ పర్యవేక్షణలో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement