పెనుకొండ: మధ్య తరగతి వర్గాలు, చిరు వ్యాపారుల సొంతింటి కల నెరవేర్చేందుకు గత వైఎస్ జగన్ ప్రభుత్వం పట్టణంలోని షీఫారానికి చెందిన 27 ఎకరాల స్థలాన్ని సేకరించింది. జగనన్న స్మార్ట్ సిటీ పేరుతో ఓ కాలనీ ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. లాటరీ ద్వారా 450 మందికి ప్లాట్లు కేటాయించింది. స్మార్ట్ సిటీలో అధునాతన సౌకర్యాలు కల్పించాలనుకున్నా ఎన్నికలు రావడం..ప్రభుత్వం మారడంతో ఆ పనులకు బ్రేక్ పడింది.
చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రిగా కొలువుదీరిన సవిత అందివచ్చిన అవకాశాలన్నీ ఉపయోగించుకుంటున్నారు. ఇప్పటికే అనుచరుల ద్వారా సహజ వనరులన్నీ దోచేసినట్లు మంత్రిపై ఆరోపణలున్నాయి. తాజాగా ఆమె కన్ను స్మార్ట్ సిటీపై పడింది. అభివృద్ధి పనుల పేరుతో రూ.కోట్లు కొట్టేసేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో జగనన్న స్మార్ట్ సిటీ పేరును ‘ఎన్టీఆర్ టౌన్ షిప్’గా మార్చారు. ఆ టౌన్‌షిప్‌లో అభివృద్ధి పనుల కోసమంటూ ప్రభుత్వంతో రూ. 16.66 కోట్లు మంజూరు చేయించారు. ఈ ఏడాది మార్చి 23న పనులకు శంకుస్థాపన కూడా చేశారు. దీంతో టౌన్‌షిప్‌లో ప్లాట్లు పొందిన వారంతా 27 ఎకరాల్లోని కొండలు, గుట్టలు, వంకలు. ఫారంఫాండ్‌లను చదును చేసి పూర్తి సౌకర్యాలు కల్పించి తమకు ప్లాట్లు ఇస్తారని భావించారు. కానీ వారి ఆశలన్నీ అడియాసలయ్యాయి.
‘ఎన్టీఆర్ టౌన్ షిప్’లో అభివృద్ధి పనుల కాంట్రాక్ట్‌ను తనకు అనుకూలమైన వారికి కట్టబెట్టించిన మంత్రి సవిత తూతూ మంత్రంగా పనులు చేయిస్తున్నారు. ప్లాట్లు చదును చేయకుండా కేవలం రోడ్లు, డ్రైనేజీలు వేయడానికి పనులు చేపట్టారు. అహుడా అధికారులు కూడా ఫొటోలకు ఫోజులిచ్చి వెళ్లిపోయారు. ప్రభుత్వం అక్కడ ఎలాంటి పనులు చేయాలని నిర్దేశించింది...ఏం పనులు చేస్తున్నారన్న విషయాలను పట్టించుకునే అధికారే లేకపోవడంతో కాంట్రాక్ట్ సంస్థ మంత్రి సూచన మేరకు పనులు మమ అనిపించేందుకు సిద్ధమైంది. దీంతో టౌన్ షిప్‌లో ప్లాట్లు పొందిన వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం చేస్తున్న రోడ్లు, ఇతర అభివృద్ధి పనులన్నీ పూర్తి చేసినా రూ.6 కోట్లు కూడా ఖర్చు కావని, ఈ లెక్కన కనీసం రూ.10 కోట్లు కొట్టేసేందుకు మంత్రి పన్నాగం పన్నారని ఆరోపిస్తున్నారు.
అభివృద్ధి పనుల పేరుతో అక్రమాల పర్వం రూ.కోట్ల అవినీతికి పన్నాగం మంత్రి సవిత కనుసన్నల్లోనే వ్యవహారం
ఇ
ప్రశ్నిస్తే
కేసులే
ది పెనుకొండ స్మార్ట్ సిటీ (ఎన్టీఆర్ టౌన్ షిప్)లో వేస్తున్న రహదారి. వందలాది మందికి ప్లాట్లు కేటాయించిన ఈ స్థలంలో అభివృద్ధి పనుల పేరుతో అధికార పార్టీ నేతలు రూ.కోట్లు కొల్లగొట్టేందుకు సిద్ధమయ్యారు. ఎక్కడైనా లేవుట్ అభివృద్ధి చేయాలంటే ముందుగా భూమిని చదును చేస్తారు. కానీ ఇక్కడ మాత్రం కొండలు, గుట్టలున్న ప్లాట్లను చదును చేయడం పక్కనపెట్టి తూతూ మంత్రంగా రోడ్లు వేస్తున్నారు. అరకొర పనులతో రూ.కోట్లు కొట్టేసేందుకు సిద్ధమయ్యారు.
‘ఎన్టీఆర్ టౌన్ షిప్’లో జరుగుతున్న పనుల గురించి మాట్లాడేందుకు సామాన్యులు జంకుతున్నారు. ఎవరు ప్రశ్నించినా ఆ మరుసటిరోజే పోలీసులతో అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపుతారని భయపడుతున్నారు. ఇప్పటికే మంత్రి ఆగ్రహానికి గురైన చాలా మంది జైలు పాలయ్యారని చెబుతున్నారు.
అభివృద్ధి పేరుతో దోపిడీ
మంత్రి డైరెక్షన్‌లోనే పనులు


