పుట్టపర్తి టౌన్: ఎలక్ట్రిక్ బస్సుల పేరుతో ఆర్టీసీని ప్రైవేటుపరం చేస్తే ఊరుకునేది లేదని ఆర్టీసీ జేఏసీ నాయకులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. జిల్లా జేఏసీ నాయకుడు షబ్బీర్ అధ్యక్షతన మంగళవారం పుట్టపర్తిలోని ఆర్డీసీ డిపో ఎదుట కార్మికులు గేట్ మీట్ నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్యక్రమానికి జేఏసీ రాష్ట్ర నాయకులు శ్రీరామ్‌నాయక్, శ్రీనివాసులు హాజరై మాట్లాడారు. సీ్త్ర శక్తి బస్సుల్లో జీరో టికెట్ విధానం తొలగించాలన్నారు. పీఆర్‌సీ కమిటీని నియమించి వెంటనే ఐఆర్ ప్రకటించాలని, పెండింగ్‌లో ఉన్న నాలుగు డీఏల అరియర్స్ కార్యక్రమంలో జేఏసీ డిపో కన్వీనర్లు గంగులయ్య, ముత్యాలప్ప, కో కన్వీనర్లు శివశంకర్, సాదిక్‌పీరా, మహిళా నాయకురాలు తిరుపతమ్మ పాల్గొన్నారు.


