స్కార్పియో బోల్తా.. ఐదుగురికి గాయాలు | - | Sakshi
Sakshi News home page

స్కార్పియో బోల్తా.. ఐదుగురికి గాయాలు

Jun 17 2026 5:27 AM | Updated on Jun 17 2026 5:27 AM

కదిరి టౌన్‌: స్కార్పియో వాహనం అదుపు తప్పి బోల్తాపడడంతో 5 మందికి గాయాలైన సంఘటన కదిరి మండలం సున్నపుగుట్ట తాండా సమీపంలోని కొత్త బైపాస్‌ వద్ద మంగళవారం చోటుచేసుకుంది. కదిరి ప్రభుత్వ ఆస్పత్రి అవుట్‌ పోస్టు పోలీసులు తెలిపిన మేరకు.. తనకల్లు మండలం చీకటిమాను పల్లి నుంచి టీడీపీ నాయకులు స్కార్పియోలో బయలుదేరి వస్తుండగా కదిరి మండలం కొత్త బైపాస్‌ వద్ద ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి వాహనం బోల్తా పడింది. దీంతో టీడీపీ నాయకులు వెంకటప్ప, యోగేంద్ర, శివన్న, పూజారి క్రిష్టప్ప, రాముకు గాయాలయ్యాయి. స్థానికలు గమనించి కదిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వెంకటప్ప, క్రిష్టప్పకు తీవ్రగాయాలు కావడంతో మెరుగైన వైద్యం కోసం అనంతపురం తీసుకెళ్లారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement