ఒకట్రెండు విద్యుత్ హైటెన్షన్ టవర్లు మార్చే చోట అధికార పక్షం రూ.కోట్లు దండుకునేందుకు 10 టవర్లు మార్చాలని చూస్తోంది. అందులో నేను కూడా బాధితుడిని. రైతులను ఇబ్బంది పెట్టిన వారికి భవిష్యత్‌లో పుట్టగతులు ఉండవు. రైతులు తమకు జరిగిన అన్యాయంపై హైకోర్టును ఆశ్రయించారు. నేను వారికి ఎప్పుడూ అండగా ఉంటా.
– సాయిప్రణీత్‌రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి, వైఎస్సార్‌సీపీ
రైతులు కోర్టుకెళ్లింది వాస్తవమే
తమ పొలాల్లో విద్యుత్ హైటెన్షన్ టవర్లు వద్దని కుటాగుళ్లకు చెందిన కొందరు రైతులు హైకోర్టుకు వెళ్లిన మాట వాస్తవమే. కోర్టు తీర్పును అనుసరించి ముందుకెళ్తాం. ఎన్ని టవర్లు మార్చాలి..ఎక్కడెక్కడ టవర్లు వేయాలనేది పవర్ గ్రిడ్ వాళ్లు నిర్ణయిస్తారు. – నాగరాజు,
డీఈ, నేషనల్ హైవేస్


