విద్యార్థులకు స్వచ్ఛమైన నీరు | - | Sakshi
Sakshi News home page

విద్యార్థులకు స్వచ్ఛమైన నీరు

Apr 7 2026 9:19 AM | Updated on Apr 7 2026 9:19 AM

ప్రశాంతి నిలయం: వసతి గృహాల్లోని విద్యార్థులకు స్వచ్ఛమైన తాగునీరందిస్తామని కలెక్టర్‌ శ్యాం ప్రసాద్‌ తెలిపారు. కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబులిటీ (సీఎస్‌ఆర్‌) నిధుల కింద ఆంధ్రప్రదేశ్‌ గ్రామీణ బ్యాంకు అందజేసిన 4 నీటిశుద్ధి యంత్రాలను కలెక్టర్‌ సోమవారం ప్రారంభించారు. వీటిని కదిరి ప్రాంతంలోని 3 బీసీ సంక్షేమ వసతి గృహాలకు, ఓ ఎస్సీ సంక్షేమ వసతి గృహానికి అందజేశారు. సీఎస్‌ఆర్‌ నిధుల ద్వారా మౌలిక వసతులు కల్పించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. కార్యక్రమంలో ఏపీజీబీ రీజనల్‌ మేనేజర్‌ రమేష్‌, పుట్టపర్తి మేనేజర్‌ చంద్రశేఖరయ్య, బీసీ సంక్షేమ శాఖ అధికారి రాజేంద్రకుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement