ప్రతి అర్జీకీ పరిష్కారం చూపాలి | - | Sakshi
Sakshi News home page

ప్రతి అర్జీకీ పరిష్కారం చూపాలి

Apr 7 2026 9:19 AM | Updated on Apr 7 2026 9:19 AM

న్యూస్‌రీల్‌

అధికారులకు కలెక్టర్‌ ఆదేశం

ప్రశాంతి నిలయం: ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్‌)లో అందే ప్రతి అర్జీని పరిశీలించి పరిష్కరించాలని కలెక్టర్‌ శ్యాం ప్రసాద్‌ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ‘పరిష్కార వేదిక’లో కలెక్టర్‌తో పాటు జేసీ మౌర్య భరద్వాజ్‌, డీఆర్‌ఓ విజయసారథి, ఆర్డీఓ సువర్ణ తదితరులు పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. వివిధ సమస్యలపై మొత్తంగా 213 అర్జీలు అందగా.. వాటి పరిష్కారం కోసం ఆయా శాఖలకు పంపారు. అనంతరం కలెక్టర్‌ అధికారులతో సమావేశమయ్యారు. ప్రజల నుంచి ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి సకాలంలో పరిష్కారం చూపాలన్నారు. పెండింగ్‌ దరఖాస్తులు, బియాండ్‌ ఎస్‌ఎల్‌ ఏ, రీ ఓపెనింగ్‌ లేకుండా అర్జీల పరిష్కారం ఉండాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement