కదిరి టౌన్: వైఎస్సార్‌సీపీ నేతల భార్యలను కించపరుస్తూ తన పత్రికలో తప్పుడు రాతలు రాసిన ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణపై చర్యలు తీసుకోవాలని వైఎస్సార్‌సీపీ నాయకులు కదిరి పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మంగళవారం సాయంత్రం సీఐ వి.నారాయణరెడ్డికి ఫిర్యాదు ప్రతిని అందజేశారు. ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ పట్టణ అధ్యక్షుడు షేక్ బాబ్జాన్, నాయకులు మాట్లాడుతూ... సభ్యసమాజం తలదించుకునే విధంగా అత్యంత జుగుప్సాకర భాషతో వైఎస్సార్‌సీపీ నేతలను తిడుతూ రాధాకృష్ణ ఆంధ్రజ్యోతి పేపర్‌లో కాలమ్ రాశారన్నారు. దాన్నే ఏబీఎన్ ఆంధ్రజ్యోతి చానల్‌లో కూడా ప్రసారం చేశారన్నారు. తక్షణమే పేపర్, ఛానల్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ ప్రతిష్టను దెబ్బతీయడమే వారి లక్ష్యమన్నారు. డబ్బా చానల్ పెట్టుకొని ముఖ్యమంర్రి చంద్రబాబుకు బినామీగా వ్యవహరిస్తున్నారన్నారు. కార్యక్రమంలో కన్వీనర్లు రవికుమార్‌రెడ్డి, మణికంఠనాయక్, వైఎస్సార్‌సీపీ జిల్లా అధికార ప్రతినిధి లింగాల మధుసూదన్‌రెడ్డి, నాయకులు రమేష్‌యాదవ్, రామచంద్ర, భాస్కర్, సదాఖత్, సమీర్‌ఖాన్, షకిల్, ఎయెసానా తదితరులు పాల్గొన్నారు.


