రాధాకృష్ణది జర్నలిజం కాదు.. బ్రోకరిజం | - | Sakshi
Sakshi News home page

రాధాకృష్ణది జర్నలిజం కాదు.. బ్రోకరిజం

Apr 8 2026 8:26 AM | Updated on Apr 8 2026 8:26 AM

చిలమత్తూరు: ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ జర్నలిజం చేయడం లేదని బ్రోకరిజం చేస్తున్నాడని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్‌, హిందూపురం సమన్వయకర్త టీఎన్‌ దీపిక మండిపడ్డారు. మంగళవారం వారు పార్టీ శ్రేణులతో కలిసి హిందూపురం పట్టణంలోని పార్టీ కార్యాలయం నుంచి రిలయన్స్‌ పెట్రోల్‌ బంక్‌ వరకూ నిరసన ర్యాలీ నిర్వహించారు. రాధాకృష్ణ మహిళా లోకానికి క్షమాపణలు చెప్పాలని వారు డిమాండ్‌ చేశారు. వైఎస్‌ జగన్‌ చెప్పిన ‘మావిగన్‌’ అమలులోకి వస్తే పరిస్థితి ఏమిటని భయపడిన కూటమి నేతలు ఏబీఎన్‌ రాధాకృష్ణతో వైఎస్సార్‌సీపీ నేతల భార్యలపై నీచపు కథనాలు, రోత రాతలు రాయించారని విమర్శించారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నేత వేణురెడ్డి, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు నాగమణి, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

రోతరాతలు క్షమించరాని నేరం

మడకశిర: ఏబీఎన్‌ రాధాకృష్ణ రోత రాతలపై మడకశిరలో మంగళవారం రాత్రి వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టణంలోని వైఎస్సార్‌ విగ్రహం వద్ద వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త ఈరలక్కప్ప ఆధ్వర్యంలో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు నిరసన చేపట్టారు. ఆంధ్రజ్యోతి ప్రతులను దహనం చేశారు. ఏబీఎన్‌ రాధాకృష్ణకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈరలక్కప్ప మాట్లాడుతూ ఏబీఎన్‌ రాధాకృష్ణ బ్రోకర్‌ అని, మహిళలను కించ పరిచే విధంగా రోత రాతలు రాయడం క్షమించరాని నేరమన్నారు. వెంటనే రాధాకృష్ణపై కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. వైఎస్సార్‌సీపీ సీఈసీ సభ్యుడు వైసీ గోవర్ధన్‌రెడ్డి, ఎస్సీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు నరసింహమూర్తి, పట్టణ కన్వీనర్‌ ఓంకుమార్‌, మండల మాజీ కన్వీనర్‌ రామిరెడ్డి, పంచాయతీరాజ్‌ విభాగం రాష్ట్ర కార్యదర్శి నాగభూషణరెడ్డి, పట్టణ కార్యదర్శి అంజలి, పట్టణ ఉపాధ్యక్షుడు గోపి, మాజీ కౌన్సిలర్‌ అన్సర్‌, పట్టణ నాయకులు ధను, నగేష్‌, ఎస్సీ సెల్‌ రాష్ట్ర కార్యదర్శి తిప్పేస్వామి, జిల్లా కార్యదర్శి రంగనాథ్‌, లక్ష్మీనారాయణ, వివిధ విభాగాల పార్టీ అధ్యక్షులు మల్లికార్జున, నరసింహ తదితరులు పాల్గొన్నారు.

ఆర్‌కేను అరెస్టు చేయాలని

వైఎస్సార్‌సీపీ నాయకుల డిమాండ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement