చిలమత్తూరు: మహిళలకు రాజ్యాంగం కల్పించిన అవకాశాలకంటే గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో సీఎం వైఎస్ జగన్ ఎక్కువ అవకాశాలు కల్పించారని వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి అన్నారు. మంగళవారం హిందూపురం పట్టణంలోని సరిగమ ఫంక్షన్ హాల్‌లో వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త టీఎన్ దీపిక ఆధ్వర్యంలో మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు నాగమణి అధ్యక్షతన మహిళా విభాగం విస్తృతస్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథులుగా వరుదు కల్యాణి, జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్, జోనల్ విభాగం అధ్యక్షురాలు విజయ మనోహరి, జెడ్పీ చైర్‌పర్సన్ బోయ గిరిజమ్మ తదితరులు పాల్గొన్నారు. వరుదు కల్యాణి మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి మహిళల భద్రతను గాలికి వదిలేశారని మండిపడ్డారు. రోజుకు 4 నుంచి 5 హత్యలు, అత్యాచారాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే 60 –70 మంది మహిళలపై దాడులు, అఘాయిత్యాలు జరుగుతున్నాయన్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో వ్యవస్థలన్నీ నిర్వీర్యం అయిపోయాయన్నారు. వైఎస్ జగన్ హయాంలో మహిళలను సామాజికంగా , రాజకీయంగా, ఆర్థికంగా ఉన్నతస్థాయిలో కూర్చోబెట్టడానికి అనేక సంస్కరణలు తీసుకువచ్చారన్నారు. రాజకీయంగా మహిళలకు 50 శాతం పదవులు ఇవ్వాలని అసెంబ్లీలో చట్టం చేసిన ఏకై క సీఎం వైఎస్ జగన్ అని కొనియాడారు. గతంలో పథకాలన్నీ మహిళల పేరుపైనే ఇస్తూ ఆర్థికంగా బలీయంగా మార్చారన్నారు. బీసీ, ఎస్‌సీ, ఎస్టీ మహిళలకు 50 సంవత్సరాలకే పింఛన్ ఇస్తామని చెప్పి చంద్రబాబు మోసం చేశారని, మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చలేక చేతులెత్తేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు వస్తుండటంతో 87 ఎమ్మెల్యే సీట్లు, 13 ఎంపీ సీట్లు రాబోతున్నాయన్నారు. మావిగన్ పై భయంనే ఏబీఎన్ రాధాకృష్ణ నీచపు రాతలు రాస్తున్నారని ధ్వజమెత్తారు.
సవితకు మంత్రిగా ఉండే అర్హత లేదు
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్ మాట్లాడుతూ ఏబీఎన్ రాధాకృష్ణ వైఎస్సార్‌సీపీ నేతల భార్యలపై నీచపు వ్యాఖ్యలు చేయడం క్షమించరాని నేరమన్నారు. బీసీశాఖ మంత్రిగా ఉంటూ బీసీలకు పింఛన్ ఇప్పించలేకపోయిన సవితకు మంత్రిగా ఉండే అర్హత లేదన్నారు. అన్యాయం చేస్తున్న కూటమి నేతలకు ముందుంది ముసళ్ల పండుగ అని హెచ్చరించారు. వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త టీఎన్ దీపిక మాట్లాడుతూ ప్రతి ఒక్క వర్గాన్ని మోసం చేసిన చరిత్ర చంద్రబాబు ప్రభుత్వానిదేనని విమర్శించారు. ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చాలని లేకపోతే ఉద్యమిస్తామన్నారు. కార్యక్రమంలో మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పెనుకొండ నియోజకవర్గ పరిశీలకురాలు మధుమతిరెడ్డి, మహిళా విబాగం నేతలు గాజుల శ్వేతారెడ్డి, మహిళా నేతలు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
రాజ్యాంగం ఇచ్చిన అవకాశాల కంటే ఎక్కువ అవకాశాలిచ్చారు
హామీల అమలులో
చంద్రబాబు ప్రభుత్వం విఫలం
మహిళా సదస్సులో
ఎమ్మెల్సీ వరుదు కల్యాణి


